siddharth: బొమ్మ‌రిల్లు సిద్ధార్థ్ ఫోన్ నెంబ‌ర్ లీక్.. వ‌రుస‌గా బెదిరింపు కాల్స్

బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన న‌టుడు సిద్ధార్థ్‌. ఇటీవ‌లి కాలంలో తెలుగులో మంచి హిట్స్ రాక‌పోవ‌డంతో త‌మిళంలో సినిమాలు చేస్తూ అక్క‌డ బిజీ స్టార్ అయ్యాడు. ఇక‌ చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహా సముద్రం సినిమాలో శర్వానంద్ తో కలిసి నటిస్తున్నాడు. ఇటీవ‌ల సిద్దార్థ్ బ‌ర్త్ డే సందర్బంగా ఆయ‌న ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేశారు మేక‌ర్స్. అయితే తాజాగా రాష్ట్ర బీజేపీ ఐటీ సెల్‌ తన పర్సనల్‌ మొబైల్ నంబర్‌ లీక్‌ చేసిందని, దాంతో నాకు బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయ‌ని ఆరోపించారు సిద్ధార్థ్‌.

త‌మిళ‌నాడు బీజేపీ ఐటీ సెల్ నా మొబైల్ నెంబ‌ర్ లీక్ చేసింది. గ‌డిచిన 24 గంట‌ల‌లో 500కు పైగా అసభ్య‌మైన మెసేజ్‌లు వ‌చ్చాయి. న‌న్ను నా కుటుంబాన్ని చంపేస్తామ‌ని, మాపై అత్యాచారం చేస్తామ‌ని బెదిరిస్తున్నారు. వీటిలో చాలా వరకు బీజేపీతో లింక్‌ ఉన్నవి.. ఆ పార్టీ గుర్తు డీపీగా పెట్టుకున్నవే ఉన్నాయి. ఇవ‌న్నీ పోలీసుల‌కు అందించాను. దీనిని నేను చాలా సీరియ‌స్‌గా తీసుకొని పోరాడ‌తాను అని సిద్ధార్థ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. నేను కోవిడ్‌తో పోరాడాలా.. ఇలాంటి వారితో పోరాడాలా’’ అని వాపోయారు సిద్ధార్థ్‌.

Advertisement