Mehaboob Dilse: శ‌ర్వానంద్‌తో గొడ‌వ‌లు జ‌రిగియా.. సిద్ధార్థ్‌కి మెహ‌బూబ్ ప్ర‌శ్న‌

Mehaboob Dilse: యంగ్ హీరోలు శ‌ర్వానంద్, సిద్ధార్థ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అజ‌య్ భూప‌తి తెర‌కెక్కిస్తున్న చిత్రం మ‌హా స‌ముద్రం. రెగ్యుల‌ర్ మాస్ ఎంట‌ర్‌టైన్ చిత్రాల‌కు భిన్నంగా ఓ డిఫ‌రెంట్ కంటెంట్‌తో ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఈ సినిమాను నిర్మించారు. సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మాతగా వ్యవహరించారు. అదితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూయేల్ హీరోయిన్లుగా నటించగా.. జగపతి బాబు, రావు ర‌మేష్ కీలక పాత్రలు పోషించారు.

Siddharth MIND BLOWING Reply To Mehaboob Dilse Question
Siddharth MIND BLOWING Reply To Mehaboob Dilse Question

మహ సముద్రం చిత్రంలో విజయ్ అనే పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో సిద్దార్థ్ బాగున్నాడు. మ్యూజిక్ బాగుంది. అజయ్ భూపతి టేకింగ్ సూపర్‌గా ఉన్న‌ట్టు తెలుస్తుంది.2017 బ్యాక్ డ్రాప్‌గా కథ చెప్పడం ప్రారంభించారు. ఇద్దరి స్నేహితుల మధ్య భావోద్వేగాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. అర్జున్‌గా శర్వానంద్, లా స్టూడెంట్‌గా అను అగర్వాల్ పాత్రల పరిచయాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ బాగుంద‌నే టాక్స్ వినిపిస్తున్నాయి.

ఏపీ, తెలంగాణలో మహా సముద్రం రూ.12.6 కోట్ల బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 13.5 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 14 కోట్లు రాబట్టాల్సి ఉంది. అయితే సినిమాకు భారీగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు మేక‌ర్స్.

ఈ కార్య‌క్ర‌మంలో సిద్దార్థ్ పాల్గొన‌గా, ఆయ‌న‌ను మెహ‌బూబ్ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ప్ర‌శ్న వేసారు. శ‌ర్వానంద్‌తో క‌లిసి ప‌ని చేసిన‌ప్పుడు సెట్‌లో ఏమైన ఈగో స‌మ‌స్య‌లు వంటివి వ‌చ్చాయా, ఒక సినిమా చేసేట‌ప్పుడు డిస్ట్ర‌బెన్స్ వ‌చ్చాయా అని అడిగాడు.దీనికి స‌మాధానం ఇచ్చిన సిద్దార్థ్ నిజ‌మైన ఆర్టిస్ట్‌కి ఇన్‌సెక్యూరిటీ ఉండ‌దు.

నేను ప‌లు భాష‌ల‌లో మ‌ల్టీ స్టార‌ర్ చేశాను. శ‌ర్వానంద్‌, నాకు మంచి నమ్మ‌కం ఉంది. షూటింగ్ జ‌రిగేట‌ప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం అంటూ ఓ ఫిలాస‌ఫీ కూడా చెప్పాడు. రానున్న రోజుల‌లో కూడా మేం ఇద్ద‌రం మంచి ఫ్రెండ్స్‌గా ఉంటాం అంటూ సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు.