Siddharth: ఒరేయ్ బామ్మర్ది.. వెరైటీ టైటిల్‌తో సిద్దార్థ్

NQ Staff - April 6, 2021 / 12:00 PM IST

Siddharth: ఒరేయ్ బామ్మర్ది.. వెరైటీ టైటిల్‌తో సిద్దార్థ్

Siddharth బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు లవర్ బాయ్ సిద్దార్థ్. ఆ తరువాత నువ్వొస్తానంటే నేనొద్దాంటాన సినిమాతో స్టార్ హీరోగా మారాడు. కానీ ఆ తరువాత సరైన సక్సెస్ కొట్టలేక వెనకబడ్డాడు. ఆట, ఓయ్, జబర్దస్త్ వంటి చిత్రాలతో సక్సెస్ కొట్టాలని చూశాడు. కానీ అవి అంతగా వర్కవుట్ అవ్వలేదు. చాలా గ్యాప్ తరువాత గృహం సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. తమిళ తెలుగు ద్విభాష చిత్రాలతో సిద్దార్థ్ ఇప్పుడు మళ్లీరెడీ అవుతున్నాడు.

Siddharth GV Prakash Orey Bammardi

Siddharth GV Prakash Orey Bammardi

ఒరేయ్ బామ్మర్ది.. వెరైటీ టైటిల్‌తో సిద్దార్థ్

సిద్ధార్థ్, జీవీ ప్రకాష్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది‘.. బిచ్చగాడు లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్ లు హీరోయిన్ గా నటిస్తున్నారు.. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రమేష్ పి పిళ్లై నిర్మించారు..యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ లు పోటాపోటీగా నటించారు.

వీరి కాంబినేషన్ లో వచ్చే యాక్షన్ చిత్రాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనున్నాయి..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పై ఏ.ఎన్ బాలాజీ ఈ నెలలో విడుదల చేయనున్నారు. సిద్ధూ కుమార్ సంగీతం అందించగా ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. మొత్తానికి సిద్దార్థ్ తెలుగు ప్రేక్షకులను వెరైటీ టైటిల్‌తో పలకరించేందుకురెడీ అయ్యాడు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us