Siddharth: ఎట్ట‌కేల‌కు దిగొచ్చిన సిద్ధార్థ్.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఆగని నిర‌స‌న జ్వాల‌లు

Siddharth: ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం చోటు చేసుకోగా, ఈ విషయంపై సైనా నెహ్వాల్ ట్వీట్ చేస్తూ దేశ ప్రధాని విషయంలో ఇలా జరగడం దురదృష్టకరం. ప్రధానికే భద్రత లేకుంటే సామాన్య ప్రజల సంగతి ఏంటి? ఈ పరిణామాన్ని ఖండిస్తున్నాను.. అంటూ సైనా నెహ్వాల్ ట్వీట్ చేశారు.ఈ ట్వీట్ పై సిద్ధార్థ వ్యంగ్యంగా స్పందించారు.

siddharth-apologises-to-saina-nehwal
siddharth-apologises-to-saina-nehwal

‘సబ్టిల్ కాక్ ఛాంపియన్ ఆఫ్ వరల్డ్… థాంక్ గాడ్ వి హ్యావ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ఇండియా. షేమ్ ఆన్ యూ #Rihanna’ అంటూ ట్వీట్ చేశాడు సిద్ధార్థ్. అతడి ట్వీట్‌ రచ్చకు దారి తీసింది. ఇప్పటికే సిద్ధార్థ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని, వెంటనే అతడి ట్వీట్‌ తొలిగించాలంటూ జాతీయ మహిళా కమిషన్‌ డిమాండ్‌ చేసింది. సైనా తండ్రి , సైనా భర్త, బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ ట్విట్టర్‌లో సిద్ధార్థ్‌ ట్వీట్‌పై అసహనం వ్యక్తం చేశాడు.

దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సిద్ధార్థ తీరును తప్పుబట్టడంతో పాటు సైనాకు మద్దతుగా నిలబడ్డారు. స‌ర్వత్ర తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో సిద్ధార్థ దిగొచ్చారు . ట్విట్టర్ వేదికగా సైనాకు క్షమాపణలు చెప్పారు. ఆయన ఓ లెటర్ విడుదల చేశారు. డియర్ సైనా… అది ఒక బ్యాడ్ జోక్. ట్వీట్ ద్వారా మిమ్మల్ని కించపరిచాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు.

అందరూ ఆపాదిస్తున్నట్లు మీ పట్ల నాకు ఎటువంటి చులకన భావన లేదు. నిన్ను అవమానించాలని ఆ ట్వీట్ చేయలేదు. నేను ఒక జోక్ వేశాను. అది తప్పుగా చేరింది. ఏది ఏమైనా మీ మనసును బాధపెట్టినందుకు నన్ను క్షమించు. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేద్దాం… అంటూ తన లేఖలు పొందుపరిచారు. ఇటీవ‌ల ఆయ‌న ఆడవాళ్లను ఉద్దేశిస్తూ చేస్తున్న ఇలాంటి ట్వీట్స్ సిద్ధార్థ గౌరవాన్ని తగ్గించేలా ఉంటున్నాయి.

siddharth-apologises-to-saina-nehwal
siddharth-apologises-to-saina-nehwal

అక్టోబర్ నెలలో సమంత త‌న మాజీ భర్త నాగ చైతన్యతో విడాకులు ప్రకటించారు. కాగా సిద్ధార్థ సమంతపై మానసిక దాడి చేశారు. పరోక్షంగా ఆమెను ఉద్దేశిస్తూ… చీటర్స్ ఎప్పటికీ బాగుపడారంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సమంతను ఉద్దేశించే అని అందరికీ తెలుసు. విడాకుల కారణంగా మానసిక వేదిక అనుభవిస్తున్న ఒక అమ్మాయిపై సిద్ధార్థ చేసిన కామెంట్ విమర్శలపాలైంది.