Prabhas: బాలీవుడ్ డైరెక్ట‌ర్‌తో భారీ యాక్షన్ సినిమా.. 2022లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ప్ర‌భాస్ చిత్రం!

Prabhas సినీ ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చామనేదానికన్నా.. ఎంత సెటిల్ అయ్యామనేది ముఖ్యం. అందులోనూ ఎంత ప్రేక్షకాధరణ పొందామనేది ముఖ్యం. అలాంటి స్టార్ డమ్ ఉన్న యాక్టర్స్ లో ప్రభాస్ ఒకరు. సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొద్దీ కాలంలోనే తన ప్రతిభతో ఎంతోమంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి.. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు. రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ లాంటి భారీ యాక్షన్ సినిమాల్లో నటిస్తూ మరో రెండేళ్ళ వరకు ఫుల్ బిజీ అయ్యారు. అలాగే మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో కూడా ఓ సినిమాని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలు కావడం మరో హైలెట్. అలా చూస్తే.. ఇకపై ప్రభాస్ చేసే ప్రతి సినిమా పాన్ ఇండియాదే అయ్యుంటుందంటున్నాయి సినీ వర్గాలు.

Siddharth Anand, Prabhas combination in a huge action movie
Siddharth Anand, Prabhas combination in a huge action movie

ప్రస్తుతం ఈ నాలుగు సినిమాలు కాకుండా మరో సినిమాకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయనేది ప్రస్తుతం హాట్ టాపిక్. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బ్యాంగ్ బ్యాంగ్, వార్ లాంటి ప్రతిష్టాత్మక సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అలాంటి దర్శకుడి నేతృత్వంలో ప్రభాస్ హీరోగా సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడతాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు ఇండస్ట్రీలో జరుగుతున్నాయట.

ప్రభాస్ ప్రజంట్ చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తయిన తర్వాతే.. వీరి కాంబినేషన్ లో ఓ భారీ యాక్షన్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని బాలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. వీలుంటే 2022 డిసెంబ‌ర్‌లో సెట్స్ పైకి తీసుకెళ్ళి 2023లో సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు టాక్. ప్ర‌స్తుతం దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో పతాన్ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత హృతిక్ రోషన్ తో ఫైటర్ ని ప్లాన్ చేశారు. బహుశ సిద్దార్థ్ ఆనంద్ కి కూడా ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాతే ప్రభాస్ తో ప్లాన్ చేస్తారని అంటున్నారు.

Advertisement