,Mahasamudram: సిద్దార్థ్ బ‌ర్త్‌డే.. మ‌హా స‌ముద్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Priyanka - April 17, 2021 / 09:25 AM IST

,Mahasamudram: సిద్దార్థ్ బ‌ర్త్‌డే.. మ‌హా స‌ముద్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌కత్వంలో శ‌ర్వానంద్, సిద్ధార్థ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న రొమాంటిక్ ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామా మ‌హా స‌ముద్రం. ఎగసిపడే సముద్రపు అలల్లో, మీరు కొలవలేనంత ప్రేమని పరిచయం చేయడానికి వస్తున్నాం.’ అంటూ ‘మహా సముద్రం’ టీమ్ కొద్ది రోజుల క్రితం రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న ‘మహాసముద్రం’ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు పేర్కొంది.

దాదాపు ఏడేళ్ల విరామం తరువాత సిద్ధార్థ్ మ‌హా స‌ముద్రం చిత్రంతో‌ తెలుగు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ రోజు సిద్ధార్థ్ బ‌ర్త్ డే కావ‌డంతో మూవీ నుండి ఆయ‌న ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో సిద్ధార్థ్ క్యూ లైన్‌లో నిలుచొని కూల్‌గా చూస్తున్న‌ట్టు క‌నిపిస్తుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాషల్లో తెరకెక్కించారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us