SHYAMALA: భ‌ర్త అరెస్ట్‌.. స్పందించిన యాంక‌ర్ శ్యామ‌ల‌

SHYAMALA చీటింగ్ కేసులో బుల్లితెర యాంక‌ర్ శ్యామ‌ల భ‌ర్త న‌రసింహా రెడ్డిని రాయ‌దుర్గం పోలీసులు మంగ‌ళ‌వారం అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఓ మ‌హిళ ద‌గ్గ‌ర అప్పు అని చెప్పి కోటీ రూపాయ‌లు తీసుకున్న అత‌ను ఇప్పుడు ఆ డ‌బ్బులు అడిగితే మొహం చాటేయ‌డ‌మే కాకుండా, త‌న‌ పై లైంగిక దాడి చేశాడ‌ట‌. ఈ విష‌యాన్ని బాధితురాలు పోలీసులకు తెలప‌డంతో న‌ర‌సింహారెడ్డితో పాటు ఆయ‌న‌కు స‌పోర్ట్‌గా ఉన్న మ‌హిళ‌ను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈ త‌తంగం జ‌రుగుతున్న నేప‌థ్యంలో శ్యామ‌ల ఎలా రియాక్ట్ అయింది,అప్పుడు తాను ఏం చేసింద‌ని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా, ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

భ‌ర్త అరెస్ట్‌ పై తాజాగా స్పందించిన శ్యామ‌ల‌… నేను మా అత్త‌గారి ఊరి నుండి హైద‌రాబాద్‌కు వ‌చ్చాను. బాగా అలిసిపోవ‌డంతో జ్వ‌రం వ‌చ్చింది. దీంతో లేవ‌లేదు. నా భ‌ర్త సోమ‌వారం బ‌య‌ట‌కు వెళ్లి తిరిగి రాలేదు. అయితే ప‌నిలో వెళ్లార‌ని అనుకున్నాను. మోసం కేసులో అరెస్ట్ అయ్యార‌ని మీడియా ద్వారా తెలిసింది. మాకు పెళ్లై ప‌దేళ్లు అయింది. ఆయ‌న ఏంటో నాకు తెలుసు. మ‌హిళ‌ల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించే మ‌న‌స్త‌త్వం కాదు అని భ‌ర్త‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడింది. ప్రాథ‌మిక విష‌యాల‌ పై నిర్ధార‌ణ వ‌చ్చే వ‌ర‌కు త‌ప్పుగా చూడొద్ద‌ని మీడియాను కోరింది శ్యామ‌ల‌.

Advertisement