SHYAMALA: వివాదంలో యాంకర్ శ్యామ‌ల భ‌ర్త‌.. అరెస్ట్ చేసిన పోలీసులు

బుల్లితెర యాంకర్ శ్యామల గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇప్ప‌టికీ ప‌లు కార్య‌క్ర‌మాల‌ను హోస్ట్ చేస్తూ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ కార్యక్రమంలోను పాల్గొన్న శ్యామ‌ల ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లంద‌రికి సుప‌రిచితం. ఈమె బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న‌ప్పుడు ఓ సారి ఎలిమినేట్ అయిన మ‌ళ్లీ త‌న‌కు దొరికిన అదృష్టంతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే శ్యామ‌ల టీవీ న‌టుడు బుల్లితెర అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. జగదేకవీరుడు అతిలోకసుందరి సీరియల్లో నడుస్తున్న సమయంలో తన భర్త టీవీ నటుడు నరసింహ అంద‌రిలా క‌నిపించ‌లేద‌ని, అందుకే తాను మొదట వెళ్లి తానే పరిచయం చేసుకుందట. అలా వారి ప‌రిచ‌యం పెళ్లి వ‌ర‌కు వెళ్లింది.

శ్యామ‌ల భ‌ర్త న‌ర‌సింహాని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిల ద‌గ్గ‌ర విడతల వారీగా కోటిరూపాయల వరకు డబ్బుని అప్పుగా తీసుకున్నాడ‌ని, ఇప్పుడు అడిగితే అవి ఇవ్వ‌క‌పోగా, త‌న‌పై లైంగిక వేధింపుల‌కు కూడా పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ఆయ‌నపై చీటింగ్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు.ఓ మధ్యవర్తి మహిళ ద్వారా నర్సింహారెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. న‌ర‌సింహాతో పాటు మ‌ధ్య‌వ‌ర్తి మ‌హిళ‌ను కూడా రిమాండ్‌కు త‌ర‌లించిన‌ట్టు తెలుస్తుంది.

Advertisement