Shyam singha roy: స్త్రీ ఎవ‌డికి దాసి కాదు.. ఆఖ‌రికి దేవుడికి కూడా.. టీజ‌ర్‌తో చించేసిన నాని

Shyam singha roy: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. టాక్సీవాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. సాయి పల్లవి.. మడోనా సెబాస్టియన్.. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. డిసెంబ‌ర్ 24న విడుద‌ల కానున్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి.

TheNewsQube-
shyam-singha-roy-teaser (1)
shyam-singha-roy-teaser (1)

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు సినిమా పై ఆసక్తిని పెంచాయి. శ్యామ్ సింగరాయ్ సినిమాలో నాని డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నాడు. ప్రియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. సినిమాలో రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు.

‘శ్యామ్‌ సింగరాయ్‌’ టీజర్‌ విడుదల కార్యక్రమం గురువారం ఉదయం ఏఎంబీ మాల్‌లో ఘనంగా జరిగింది. దీనిలో భాగంగా టీజర్‌ను సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందం షేర్‌ చేసింది. నటీనటుల నటన, టీజర్‌ ముందు వచ్చే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘‘స్త్రీ ఎవ్వరికీ దాసి కాదు. ఆఖరికి దేవుడికి కూడా. ఖబడ్దార్‌‌’’ అంటూ శ్యామ్‌సింగారాయ్‌ పాత్రలో నాని చెప్పే డైలాగ్‌లు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపేలా ఉన్నాయి.

‘టక్‌ జగదీశ్‌’ తర్వాత నాని నటించిన చిత్రమిదే. ఇందులో ఆయన శ్యామ్‌ సింగరాయ్‌, వాసు అనే రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. నానికి జోడీగా సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలుగా నటించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ స్వరాలు అందిస్తున్నారు.

నాని న‌టించిన చివ‌రి చిత్రం ట‌క్ జ‌గ‌దీష్ ఓటీటీలో విడుద‌ల కాగా, ఈ మూవీ పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది. దీంతో చాలా హోప్స్ పెట్టుకున్నాడు నాని. టీజ‌ర్ చూస్తుంటే మూవీ మంచి హిట్ అయ్యేలా క‌నిపిస్తుంది.

Shyam Singha Roy Telugu Teaser | Nani | Sai Pallavi | Krithi Shetty | Rahul Sankrithyan – YouTube