Shyam Singh Roy: నాని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘శ్యామ్ సింగరాయ్’ రిలీజ్ ఎప్పుడంటే?

Shyam Singh Roy: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల నాని నటించిన ‘టక్ జగదీష్’ ఫిల్మ్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది. ఆ చిత్రంలో నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే, ఆ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాకపోవడం పట్ల పలువురు ప్రొడ్యూసర్స్ నానిపై ఫైర్ అయ్యారు. ఆ సంగతులు పక్కనబెడితే.. నాని అభిమానులకు మేకర్స్ దసరా సందర్భంగా సర్‌ప్రైజ్ ఇచ్చారు.

Shyam Singh Roy Movie Release Date
Shyam Singh Roy Movie Release Date

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘ట్యాక్సీవాలా’ ఫిల్మ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో వస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ ఫిల్మ్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. నిహారికి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. కాగా ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో నాని పాత్రకు సంబంధించన పోస్టర్‌ను విడుదల చేశారు. దేవి భయంకరమైన రూపమే ‘కాళి’ అనే క్యాప్షన్‌తో ‘శ్యామ్ సింగరాయ్’ నాని పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని వాసు పాత్రను పోషిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకుని నాని అభిమానులతో పాటు సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాని నటించిన గత చిత్రం ‘టక్ జగదీష్’ ఓటీటీలో విడుదల కాగా తర్వాత తెరకెక్కిన చిత్రం టాకీసుల్లో విడుదల అనే ప్రకటన రావడంతో ఆనందపడిపోతున్నారు.

హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ‘శ్యామ్ సింగరాయ్’ ఉంటుందని మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌ను బట్టి అర్థమవుతున్నది. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా సాయిపల్లవి, కృతిశెట్టి నటిస్తున్నారు. చిత్రానికి మిక్కీజే.మేయర్ సంగీతం అందిస్తున్నారు. నాని ఈ చిత్రంతో పాటు వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో ‘అంటే సుందరానికి’ మూవీలోనూ నటిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా అలరిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాలు సెట్స్ పైన ఉండగానే నాని తన నెక్స్ట్ మూవీ అనౌన్స్‌మెంట్ దసరా రోజున ఉంటుందని ఆల్రెడీ ప్రకటించేశాడు. ఆ చిత్రం ద్వారా కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇకపోతే ఆ సినిమాను లక్ష్మీ వెంకటేశ్వర్ సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.