Shubman Gill : నేషనల్ క్రష్ పై మనసు పారేసుకున్న గిల్.. సారాను పక్కన పెట్టేసాడా?
NQ Staff - March 6, 2023 / 06:10 PM IST

Shubman Gill : శుభమన్ గిల్.. ఇతడి పేరు ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.. ఇతడు క్రికెటర్ గా ఎంత ఫేమస్ అవుతున్నాడో తన పర్సనల్ లైఫ్ వల్ల వచ్చే రూమర్స్ తో కూడా అంతే ఫేమస్ అవుతున్నాడు.. ఇతడి పర్సనల్ లైఫ్ పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ కొనసాగుతుంది.. గిల్ ఇంతకు ముందు సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో ప్రేమాయణం నడిపాడు..
అయితే ఇది బెడిసి కొట్టింది అని ఆ తర్వాత ఇతడు బాలీవుడ్ స్టార్ డాటర్ సారా అలీ ఖాన్ తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి.. ఈ రూమర్స్ ను నిజం చేస్తూ గిల్ సారా ఖాన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన పిక్స్ బయటకు వచ్చాయి.. దీంతో ఇది నిజమేనని చర్చ సాగుతూ ఉండగానే తాజాగా గిల్ తన క్రష్ ఎవరో చెప్పేసి మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు.
శుభమన్ గిల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ తన ఫస్ట్ బాలీవుడ్ క్రష్ ఎవరు? అని ప్రశ్నించగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న అంటే ఇష్టమని ఆమె తన ఫస్ట్ క్రష్ అని చెప్పాడు.. ఈ ప్రశ్నను ముందు గిల్ దాటవేయడానికి ప్రయత్నించినా మీడియా వదలక పోవడంతో ఈయన రష్మిక పేరు బయట పెట్టాడు.. గిల్ అలా చెప్పాడో లేదో రష్మిక కూడా ట్రెండింగ్ లోకి వచ్చేసింది..
మరి ఈమె గిల్ చేసిన కామెంట్స్ మీద ఇంత వరకు స్పందించలేదు.. ఈమె స్పందించాలని ఆమె ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఇక రష్మిక మందన్న 2016లో కిరాక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగులోకి ఎంటర్ అయ్యింది. ఇక ఈ అమ్మడి దశ మార్చింది మాత్రం పుష్ప సినిమా అనే చెప్పాలి.. ఈ సినిమాతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా ఈమె అవతరించింది.. ప్రెజెంట్ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. సారా