Shruti Haasan:శృతి హాస‌న్ కొత్త బాయ్ ఫ్రెండ్‌ని చూశారా.. బ‌ర్త్‌డే రోజు అత‌నితో ర‌చ్చ చేసిన అందాల భామ‌!

Shruti Haasan క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ మంచి మ‌ల్టీ టాలెంటెడ్ ప‌ర్స‌న్ అన్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. న‌టిగానే కాక సింగ‌ర్‌గాను, ర‌చ‌యిత‌గాను, ద‌ర్శ‌కురాలిగాను ఆమెలో టాలెంట్స్ చాలానే ఉన్నాయి. స‌మ‌యాన్ని బ‌ట్టి బ‌య‌ట‌పెడుతూ అందరిని అల‌రిస్తూ ఉంటుంది శృతి హాస‌న్. అయితే ఈ అమ్మ‌డు త‌న సినిమాల‌తో పాటు ప్రేమాయ‌ణంతోను తెగ వార్త‌ల‌లో నిలుస్తూ ఉంది. కొన్నేళ్ళ క్రితం మైఖేల్ అనే వ్య‌క్తితో ప్రేమ‌లో ప‌డ్డ శృతి ఆయ‌న‌తో ఏకాంతంగా గ‌డిపేందుకు సినిమాలు కూడా మానేసింది. ఎప్పుడైతే మేఖేల్‌తో బ్రేక‌ప్ చెప్పిందో అప్ప‌టి నుండి మ‌ళ్ళీ సినిమాల ‌పై దృష్టి పెట్టింది.

ఒక‌ప్పుడు వ‌రుస ఆఫ‌ర్స్‌తో దూసుకెళ్ళిన శృతి హాస‌న్ ఇప్పుడు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. భారీ ప్రాజెక్ట్స్ ఈ అమ్మ‌డి వెనుక క్యూ కడుతున్నాయి. ఆ మ‌ధ్య క్రాక్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన శృతి ఈ సినిమాతో మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. ఇక మ‌రి కొద్ది రోజుల‌లో వ‌కీల్ సాబ్ అనే చిత్రంలో ప‌వ‌న్‌తో క‌లిసి సంద‌డి చేయ‌నుంది. ఇక రీసెంట్‌గా ప్ర‌శాంత్ నీల్‌- ప్ర‌భాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రం స‌లార్‌లోను క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశాన్ని అందుకుంది. ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్‌ల‌ను ప‌క్క‌న పెట్టి శృతి హాస‌న్‌కు ఛాన్స్ ఇవ్వ‌డం పట్ల ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి.

అయితే సినిమాల సంగ‌తి ఎలా ఉన్నా శృతి ప్రేమాయ‌ణం అభిమానుల‌కు ఎప్ప‌టికీ ఆస‌క్తిక‌రంగానే ఉంటుంది. ఈ మ‌ధ్య అభిమానుల‌తో చిట్ చాట్ చేసిన శృతి హాస‌న్ ఓ నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా నేను ప్రేమ‌లో ఉన్నానంటూ బ‌దులిచ్చి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే శృతి ల‌వ్‌లో ప‌డింది ఎవ‌రితో అని అంద‌రు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తుండ‌గా శృతి బ‌ర్త్‌డే రోజు డూడుల్ ఆర్టిస్ట్‌ సాంత‌ను హ‌జారికా.. శృతిని హ‌గ్ చేసుకొని ఓ పోస్ట్ పెట్టాడు. అంతేకాదు ఇతడు ముంబైలో శృతిహాసన్ తో ప్రీ బ‌ర్త్ డే లంచ్ డేట్ కు వెళ్లాడు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోను ఈ ఇద్ద‌రు క‌లిసి కనిపించారు. టైం దొరికితే చెట్టాప‌ట్టాలేసుకొని తిరుగుతున్నారు. దీంతో శృతి హాస‌న్ కొత్త బాయ్ ఫ్రెండ్ ఇత‌డేనేమో అంటూ నెటిజ‌న్స్ చెవులు కొరుక్కుంటున్నారు.

Advertisement