Shruti haasan: వావ్ శృతి హాస‌న్.. నీలో ఇంత అందం దాగి ఉందా?

Shruti haasan: క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటుంది. దక్షిణాది మొత్తంలోనూ హవాను చూపిస్తూ వరుసగా ఆఫర్లను అందుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తోంది. చిన్న వయసులోనే గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది శృతి హాసన్. అలాగే సొంతంగా కొన్ని పాటలు కంపోజ్ చేసింది.

shruti haasan stunning look4
shruti haasan stunning look4

టీనేజ్‌లోనే పలు విభాగాల్లో సత్తా చాటుతూ పేరు సంపాదించుకున్న కమల్ డాటర్ శృతి హాసన్.. 2000లో వచ్చిన ‘హే రామ్’ అనే చిత్రంలో చిన్న పాత్ర చేసి నటిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అనంతరం ‘లక్’ అనే హిందీ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఇక, తెలుగులో సిద్దార్థ్ హీరోగా వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’తో హీరోయిన్‌గా పరిచయం అయింది.

shruti haasan stunning look3
shruti haasan stunning look3

శృతి హాసన్ తెలుగు హీరోలు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సహా ఎంతో మందితో స్క్రీన్ షేర్ చేసుకుంది. కెరీర్ పరంగా బిజీగా ఉన్న టైంలోనే చాలా కాలం పాటు గ్యాప్‌ తీసుకుంది. ఈ క్రమంలోనే రీఎంట్రీ ఇచ్చి ‘క్రాక్’, ‘వకీల్ సాబ్’తో సక్సెస్‌ను అందుకుంది. ఇక, ఇప్పుడు ఈ బ్యూటీ ‘సలార్‌’తో పాటు బాలయ్య మూవీ చేస్తోంది.

shruti haasan stunning look2
shruti haasan stunning look2

శృతిహాసన్ గత కొంత కాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద వరుస విజయాలను అందుకుంటున్న విషయం తెలిసిందే. మొదట్లో ఆమెను కొందరు ఐరన్ లెగ్ అని అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం వరుస హిట్స్ తో ఆమె లక్కీ గర్ల్ గా మారుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత క్రాక్ సినిమాతో కూడా ఆమె సక్సెస్ కొట్టి మరొకసారి లక్కీ సెంటిమెంట్ ను నిజం చేసింది.

shruti haasan stunning look
shruti haasan stunning look

గోపీచంద్ మలినేని మరొకసారి ఆమెతో సినిమా చేయాలని బాలకృష్ణ 107వ సినిమా కోసం సంప్రదించాడు. ఆమె మొదట్లో కొంత ఆలోచించినప్పటికి ఆ తర్వాత గోపీచంద్ తో ఉన్న మంచి సాన్నిహిత్యంతో సినిమా చేసేందుకు వెంటనే ఒప్పుకుంది. ఎందుకంటే ఇది వరకే ఈ దర్శకుడితో బలుపు అనే సినిమా కూడా చేసింది. ఇక క్రాక్ సినిమా అనంతరం బాలకృష్ణ సినిమా కూడా చేసేందుకు బాగానే ఒప్పుకుంది

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శృతి హాస‌న్ తాజాగా ట్రెడిష‌న‌ల్‌కు గ్లామ‌ర్ ట‌చ్ చేసి ర‌చ్చ చేస్తుంది. శృతి హాస‌న్ న్యూ లుక్స్ చూసి అందరి మ‌తులు పోతున్నాయి. ప్ర‌స్తుతం ఆమె పిక్స్ తెగ వైర‌ల్ అవుతున్నాయి.