Shruti Haasan: త‌న బాడీలో ఆ పార్ట్ కోసం శృతి చాలా ఖ‌ర్చు చేసింద‌ట‌..!

Shruti Haasan: లోక నాయకుడు కమల్ హాసన్ కుమార్తె శృతి హాస‌న్ బోల్డ్ అండ్ బ్యూటీ ఫుల్ హీరోయిన్ అన్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. నటనతో, డ్యాన్స్‌తో, పాటలతో.. తన ప్రతిభను చూపుతూ తండ్రి చాటు కుమార్తె అన్న ట్యాగ్‌ను తొలగించుకొని, ప్రతిభావంతురాలిగా నిలదొక్కుతుంది. ఓ వ్య‌క్తితో ప్రేమ‌లో వ‌ల‌న కొన్నాళ్లు సినిమాల‌కు దూరంగా ఉన్న శృతి హాస‌న్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

Shruti Haasan

ప్ర‌స్తుతం శృతి హాస‌న్ బ్రాండింగ్‌తోనూ బిజీ బిజీగా ఉంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పెడుతూ కుర్రకారు గుండెల్ని పిండేస్తోంది. దానికితోడు ఈమె చేతిలో ప్రస్తుతం వరస సినిమాలున్నాయి. ప్ర‌స్తుతం పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్ చిత్రంలో న‌టిస్తుంది. ఈ సినిమా హిట్ అయితే శృతికి మ‌ళ్లీ ఆఫ‌ర్స్ వెల్లువ కుర‌వ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

మొహమాటం లేకుండా… కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే హీరోయిన్లలో మొదటి స్థానం శృతి హాసన్ కే దక్కుతుంది. తరుచుగా బాయ్ ఫ్రెండ్స్ ని మార్చేస్తుంటుంది. అయినా ఆ విషయాన్ని దాచిపెట్టదు. అలాగే, ఒకప్పుడు తన తాగుడు అలవాటు గురించి కూడా బయటపెట్టింది.

ఏ విష‌యాన్నైన కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడుతుంది శృతి హాస‌న్.అంతేకాదు త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాలు కూడా నిర్మొహ‌మాటంగా నెటిజ‌న్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది . ప్ర‌స్తుతం ప్రముఖ ఆర్టిస్ట్ శాంతను హాజరికతో ఎక్కువ స‌మ‌యం స్పెంట్ చేస్తుంది.. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా ప్రకటించకపోయినా… వారు షేర్ చేసే ఫోటోలు చూసి జనాలు అలా ఫిక్స్ అయిపోయారు.

Shruti Haasan

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శాంతను మాట్లాడుతూ వృత్తిపరంగా తాము మంచి స్నేహితులమని, చాలా అభిప్రాయాలు కలిశాయని చెప్పుకొచ్చాడు.అయితే తాజాగా శాంత‌ను, శృతి ఒకే చోట కూర్చొని చాట్ సెష‌న్ నిర్వ‌హించారు. ఇందులో ఓ నెటిజ‌న్ నీ బాడీలో ముక్కు ఇష్టమేనా అని ప్రశ్న వేశాడు. దానికి ఆమె ఇచ్చిన సమాధానం అందరికి షాక్ ఇచ్చింది.

నీ ముక్కు ఇష్ట‌మేనా అన్న ప్ర‌శ్న‌కు .. ఓ ఎస్, నా బాడీలో దాని కోస‌మే ఎక్కువ ఖ‌ర్చు పెట్టాను అని పేర్కొంది శృతి. ఎప్ప‌టిలానే శృతి స్ట్రైట్ ఆన్స‌ర్ ఇవ్వ‌డంతో అంద‌రు అవాక్క‌య్యారు. శృతి ముక్కు మొద‌ట్లో కొంత తేడాగా ఉండేది. దాంతో ఆమె ముక్కుకి కాస్మెటిక్ సర్జరీ చేయించుకొంది. అయిన సెట్ కాలేదు. మళ్ళీ లండన్ వెళ్లి సర్జరీ చేయించుకొంది.

గ‌బ్బ‌ర్ సింగ్ స‌మ‌యంలో శృతి ముక్కుకి ఇప్ప‌టి శృతి ముక్కు ఆకారానికి చాలా తేడా ఉంటుంది. ముక్కు కోసం ఆమె ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టింది. అయితే ఈ విషయాన్ని శృతి హాసన్ దాచుకోకుండా చెప్పుకోవడం విశేషం. ఇటీవలే ‘క్రాక్’ సినిమా సక్సెస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది శృతి.