Shruthi Haasan: శాంత‌నుని త‌న ల‌వ‌ర్ అని ఒప్పేసుకున్న శృతి హాస‌న్

Shruthi Haasan: క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ సినిమా రంగంలో స‌క్సెస్ ఫుల్‌గా సాగుతున్న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఆ మధ్య‌ ఇంగ్లాండ్ సింగర్ మైకేల్ కోర్సులే అనే అతనితో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయిన శృతి హాసన్ ఇక అతనినే పెళ్లి చేసుకుంటుందని, సినిమాలకు సైతం దూరం అయిపోతుంది అని అందరూ భావించారు. నిజంగానే కొన్నాళ్లు సినిమాలు కూడా చేయలేదు.

Shruti Haasan Reveals his Boyfriend Santanu Hazarika
Shruti Haasan Reveals his Boyfriend Santanu Hazarika

కాని స‌డెన్‌గా అత‌నికి బ్రేక‌ప్ చెప్పి చాలా డిప్రెష‌న్‌కి వెళ్లింది. ఆ త‌ర్వాత క్రాక్ లాంటి సినిమా ఆఫ‌ర్ రాగా, ఆసినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో మ‌ళ్లీ వ‌రుస పెట్టి సినిమాలు చేస్తుంది. ఈ స‌మ‌యంలో మరో వ్యక్తితో డేటింగ్ చేస్తూ ఆసక్తికరంగా వార్తల్లోకెక్కింది. గత కొద్ది రోజులుగా శృతిహాసన్ శంతను హజారికా అనే ఒక ఆర్టిస్ట్ తో సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే.. అయితే వీరిద్దరి మధ్య బంధం ఏమిటి అనేది మాత్రం సరైన క్లారిటీ ఆమె ఇవ్వడం లేదు.

తాజాగా శృతి హాసన్ మరియు ఆమె ప్రియుడు శాంతను హజారికా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో క్విజ్ తీసుకున్నారు, అందులో వారు తమకు ఒకరి గురించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తమ రిలేషన్‌షిప్‌లో ‘ఐ లవ్ యూ’ అని మొదట చెప్పింది తానేనని ఆ వీడియోలో శృతి వెల్లడించింది. ఇద్దరిలో ఎవరు ఒక రక్షణగా ఉన్నారు అని అడిగినప్పుడు, శృతి మరియు శాంతను ఒకరినొకరు చూపించుకున్నారు.

శృతి మాట‌ల‌తో ఇప్పుడు ఆమె శాంత‌నుతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న‌ట్టు అర్ధ‌మైపోయింది. ఇక శృతి, శాంతనులలో శృతి ఎక్కువగా శుభ్రం చేస్తుందని మరియు శాంతను ఎక్కువగా తింటాడని వెల్లడించారు. శ్రుతి సోదరి అక్షర పోస్ట్‌పై స్పందిస్తూ, “నిజంగా గుడ్ మార్కింగ్ అని చెబుతూ నవ్వుతున్న ఎమోజీలతో కామెంట్ చేసింది.

Shruti Haasan Reveals his Boyfriend Santanu Hazarika
Shruti Haasan Reveals his Boyfriend Santanu Hazarika

ప్ర‌స్తుతం పాన్-ఇండియా ప్రాజెక్ట్ సలార్ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి కేజీఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా కనిపించనుంది. మెగాస్టార్ సరసన కూడా ఆమె హీరోయిన్ గా ఎంపికయిందని అంటున్నారు.