Shruti Haasan : నువ్వు వర్జిన్ వేనా.. శృతిహాసన్ కు నెటిజన్ ప్రశ్న.. దిమ్మతిరిగే ఆన్సర్..!
NQ Staff - March 17, 2023 / 09:31 AM IST

Shruti Haasan : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత స్టార్ సెలబ్రిటీలు ఎక్కువగా వాడేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా వారికి ఉపయోగపడినంతగా ఇంకెవరికీ ఉపయోగ పడట్లేదు కాబోలు. ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతోంది. అంతే కాదు అప్పుడప్పుడు తమ ఫ్యాన్స్ తో లైవ్ చాట్ లో కూడా పాల్గొంటున్నారు.
ఇక తాజాగా శృతిహాసన్ కూడా తన ఫ్యాన్స్ తో లైవ్ చాటింగ్ లో పాల్గొంది. అమ్మడు ఇప్పుడు ముంబైలో ఉంటుంది. ప్రస్తుతం సలార్ సినిమాతో పాటు మరో రెండు సినిమా షూటింగుల్లో పాల్గొంటుంది ఈ బ్యూటీ. అంతే కాకుండా ప్రియుడితో కలిసి ముంబైలో ఒకే ఇంట్లో సహజీవనం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
నీతో డేటింగ్ చేయొచ్చా..?
ఈ క్రమంలోనే తాజాగా ఆమె తన ఫ్యాన్స్ తో లైవ్ చాట్ లో పాల్గొంది. ఇందులో ఆమెను ఓ నెటిజన్ నీతో డేటింగ్ చేయొచ్చా అని అడిగాడు. దానికి ఆమె నో ఆని చెప్పింది. మరో నెటిజన్ స్పందిస్తూ.. నువ్వు వర్జిన్ వేనా అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఆమె కూడా దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది.
ముందు నువ్వు వర్జిన్ స్పెల్లింగ్ కరెక్టుగా రాయడం నేర్చుకో అంటూ చెప్పింది. అంతే గానీ తాను వర్జినా కాదా అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. దాంతో నెటిజన్లు నువ్వు కావాలనే ఆన్సర్ చెప్పట్లేదు. నిజంగా నువ్వు వర్జిన్ అయితే చెప్పేదానికి.. కాదు కాబట్టే చెప్పట్లేదు అంటూ ఆడేసుకుంటున్నారు.