Shruti Haasan : పెళ్లికి ముందే పిల్లల్ని కంటే తప్పేంటి.. శృతిహాసన్ సంచలన వ్యాఖ్యలు..!
NQ Staff - June 1, 2023 / 10:01 AM IST

Shruti Haasan : ఇప్పుడు జనరేషన్ చాలా మారిపోతోంది. ఒకప్పుడు పెండ్లి అయిన తర్వాత మాత్రమే పిల్లల్ని కనేవారు. కానీ ఈ నడుమ అలా కాకుండా పెండ్లికి ముందే డేటింగ్ పేరుతో దారుణాలకు ఒడిగడుతున్నారు. పెండ్లికి ముందే పిల్లల్ని కనేస్తున్నారు. మన దేశంలో కూడా ఇలాంటి కల్చర్ రోజురోజుకూ పెరిగిపోతోంది.
రీసెంట్ గా అలియా భట్ కూడా పెండ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది. అమీ జాక్సన్ కూడా పెండ్లికి ముందే కొడుకును కనింది. ఇప్పుడు గోవా బ్యూటీ ఇలియానా కూడా పెండ్లికి ముందే ప్రెగ్నెంట్ అంటూ అందరికీ షాక్ ఇచ్చింది. కాగా ఇప్పటికీ తన బిడ్డకు తండ్రి ఎవరనేది ఆమె బయట పెట్టట్లేదు.
ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో హీరోయిన్ శృతిహాసన్ షాకింగ్ కామెంట్లు చేసింది. ఆమె ఇప్పటికే చాలామందితో డేటింగ్ చేసి వదిలేసింది. ఇప్పుడు శాంతాను హజారికతో డేటింగ్ చేస్తోంది. వీరిద్దరూ కలిసి ముంబైలో ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్న ఎదురైంది.
పెండ్లికి ముందు పిల్లల్ని కనడాన్ని మీరు ఎలా చూస్తారా అని అడగ్గా.. ఇందులో తప్పేముంది. పిల్లల్ని కనేహక్కు ఆడవారికి ఉంది. కాబట్టి ఎప్పుడు కనాలనేది వారే నిర్ణయించుకుంటారు. నేను దాన్ని గౌరవిస్తాను.
ఆడవారి స్వేచ్ఛకు సమాజంలో గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన కామెంట్లను బట్టి చూస్తుంటే ఆమె కూడా పెండ్లికి ముందే పిల్లల్ని కంటుందా ఏంటీ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.