Shruti Haasaan: శృతి హాస‌న్ శ‌రీరాన్ని తెగ వాడేస్తున్న బాయ్‌ఫ్రెండ్‌.. నెటిజ‌న్స్ కామెంట్స్ ఏంటి?

Shruti Haasaan లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కూతురు శృతి హాస‌న్ ఈ మ‌ధ్య కాలంలో చేస్తున్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. కొత్త బాయ్ ఫ్రెండ్‌తో ముద్దు ముచ్చట్లు చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. గ‌తంలో విదేశి వ్య‌క్తితో ప్రేమ‌లో మునిగి తేలిన ఈ అమ్మ‌డు అత‌ని కోసం సినిమాలే మానేసింది. అత‌నితో బ్రేక‌ప్ అయ్యాక తిరిగి సినిమాలు చేస్తుంది. ఈ క్ర‌మంలో శంత‌ను అనే కొత్త బాయ్‌ఫ్రెండ్‌ని ప‌రిచ‌యం చేసింది.

లాక్ డౌన్ నుండి తన బాయ్ ఫ్రెండ్ తో తెగ ఎంజాయ్ చేస్తున్న శృతి హాస‌న్ ఎప్ప‌టి క‌ప్పుడు త‌న చేష్ట‌ల‌తో వార్త‌ల‌లోనే నిలుస్తూనే ఉంది. ఆ మ‌ధ్య‌ పబ్లిక్‌గా ఈ ఇద్దరూ చేసిన విన్యాసాలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. సూపర్ మార్కెట్‌లో అందరూ చూస్తుండగానే.. ప్రియుడి మీద కాలు వేసి.. ముద్దు పెట్టేశారు. మాస్క్‌లు ధరించి కరోనా నిబంధనలు పాటిస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

రీసెంట్‌గా షూటింగ్ కోసం ముంబైని వ‌దిలి వెళుతున్న స‌మ‌యంలో శృతి హాస‌న్ అత‌ని బాయ్ ఫ్రెండ్‌కి గ‌ట్టిగా హ‌గ్ ఇచ్చి బ‌య‌లుదేరింది. వీరి ఎయిర్‌పోర్ట్ ఫొటోలు కూడా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. ఇక శంతను హజారిక వాల్ పెయింటింగ్ ఆర్టిస్ట్ అన్న సంగతి తెలిసిందే. గోడల మీద చేయాల్సిన ప్రాక్టీస్‌ను శ్రుతీ హాసన్ శరీర భాగాలపై చేస్తున్నారు. శ్రుతీ హాసన్ నడుము మీద థగ్ లైఫ్ అంటూ తన స్టైల్లో పెయింటింగ్‌ వేశాడు. ఆ ఆర్ట్‌ను శ్రుతీ హాసన్ చూపిస్తూ.. ఇదిగో ఇలా వాడేస్తున్నాడు అని చెప్పుకొచ్చారు.

సోష‌ల్ మీడియాలో తెగ అగ్గా రాజేస్తున్న ఈ జంట‌ని చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. నెటిజ‌న్స్ అయితే ఇదేమి పోయే కాలం ఇలాంటి పిచ్చి పిచ్చి ప‌నులు చేస్తున్నారు అంటూ కామెట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ ఏడాది క్రాక్, వకీల్ సాబ్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన శృతి ప్రస్తుతం తమిళంలో లాభం అనే సినిమా చేస్తుంది. సలార్ సినిమా లో ప్ర‌భాస్ స‌ర‌స‌న నటిస్తుందనే సంగతి తెలిసిందే.