Shruti Haasan: సమంతకు షాకిచ్చిన సలార్ బ్యూటీ..!

Shruti Haasan: ప్రతి సంవత్సరం మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ టైటిల్ ను గెలుచుకుంటూ.. మన స్టార్ హీరోయిన్లు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఈ సారి హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ టైటిల్ ను గ్లామర్ హీరోయిన్ శృతి హాసన్ 30 సంవత్సరాల వయస్సులో గెలుచుకున్నారు. ఆమె దాదాపు 7 సంవత్సరాల తర్వాత ఈ టైటిల్ ను గెలుచుకోవడం విశేషం. అలాగే శృతి హాసన్ 20 సంవత్సరాల వయస్సులో లైఫ్ చాలా హాయిగా ఉండేదని.. 30 లో జీవితం ఒక ఫన్ ఫ్యాక్ట్ తో జీవిస్తామని అంటున్నారు. ఇక ఈ వయస్సులో లైఫ్ ని లీడ్ చేయడం అంతా తేలికైన విషయం కాదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శృతి హాసన్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించి ప్రేక్షకాధరణ పొందారు. ఇప్పుడు ఎంతో మంది హీరోయిన్లను దాటుకుని టాప్ వన్ స్థానంలో నిలవడం సాధారణ విషయం కాదు. అయితే తాను సినిమాల కోసం, ముఖ్యంగా కెరీర్ కోసం ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు.

Shruti Haasan

గతేడాది హీరోయిన్ సమంత టాప్ ప్లేస్ లో నిలిచారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఏం మాయ చేశావే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అక్కినేని వారసుడు నాగచైతన్య ను వివాహం చేసుకున్నారు. ఆమె తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటించి మెప్పించారు. ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్న సమంత అక్కినేని ఈ సారి హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా రెండవ స్థానంలో నిలిచారు. ఇక సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎప్పటికప్పుడు వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటారు.

Shruti Haasan

హైదరాబాద్ టైమ్స్ రిలీజ్ చేసిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్ లో తర్వాత స్థానంలో పూజా హెగ్డే, నాల్గవ స్థానంలో అదితి రావ్ హైదరీ నిలిచారు. పూజా హెగ్దే గతేడాది అల్లు అర్జున్ సరసన బుట్ట బొమ్మగా నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదితి రావు హైదరీ తెలుగులో చేసిన రెండు, మూడు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకుంది. వీరితో పాటు రకుల్, రష్మికా, కాజల్ అగర్వాల్, నిధి అగర్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ లు ది మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా నిలిచారు.