Shruti Haasan: ‘సలార్’‌లోనూ అదే స్పెషల్: శృతిహాసన్ నోట ప్రశాంత్ నీల్ మాట.!

NQ Staff - September 24, 2022 / 05:24 PM IST

Shruti Haasan: ‘సలార్’‌లోనూ అదే స్పెషల్: శృతిహాసన్ నోట ప్రశాంత్ నీల్ మాట.!

Shruti Haasan: ప్యాన్ ఇండియా స్టార్‌ ప్రబాస్‌తో ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మూవీ ‘సలార్’. భారీ బడ్జెట్‌తో భారీ యాక్షన్ సీక్వెన్సెస్‌తో ప్రబాస్ ఇమేజ్‌కి తగ్గట్లుగా ఈ సినిమాని రూపొందిస్తున్నాడు ప్రశాంత్ నీల్.

శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే పెదనాన్న కృష్ణంరాజును పోగొట్టుకున్న బాధను సైతం గుండెల్లో దాచుకుని, ప్రబాస్ ఈ సినిమా షూటింగులో పాల్గొంటున్నాడు. కాగా ఈ సినిమాలో ప్రబాస్ సరసన ముద్దుగుమ్మ శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా శృతి హాసన్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించీ, సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్’ చిత్రం ఏ స్థాయిలో గుర్తింపు దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కన్నడ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలా విస్తసరించాడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో.

‘అది’ నచ్చే ఓకే చేశా.!

Shruti Haasan admires Prashanth Neel Making Style

Shruti Haasan admires Prashanth Neel Making Style

భారీ యాక్షన్ సినిమాకి తల్లి సెంటిమెంట్‌ని ప్రధానంగా చూపించాడు ‘కేజీఎఫ్’ కోసం ప్రశాంత్ నీల్. ఇప్పుడు ‘సలార్’లోనూ అదే తరహా సెంటిమెంట్ చూపించబోతున్నాడట. అయితే, అదేంటనేది ప్రస్తుతానికి సస్పెన్సే కానీ, సెంటిమెంట్‌ని ఎంత హార్ట్ టచ్చింగ్‌గా చూపిస్తాడో, అంతే హైప్‌లో యాక్షన్ సీన్స్‌ కూడా తెరకెక్కిస్తాడు ప్రశాంత్ నీల్.

యాక్షన్ సినిమాకి ఎమోషనల్ టచ్ ఇవ్వడమే ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ అంటోంది శృతి హాసన్. ‘కేజీఎఫ్’ హిట్ అయ్యిందని ఈ సినిమాకి ఓకే చేయలేదు. ప్రశాంత్‌నీల్‌లోని ఆ మేకింగ్ స్టైల్ నచ్చే ‘సలార్’‌కి ఓకే చేశానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది శృతిహాసన్.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us