shruthi hassan: ఇష్ట‌మైన ఫొటో షేర్ చేయ‌మ‌ని అడిగిన నెటిజ‌న్.. బాయ్‌ఫ్రెండ్‌తో స‌న్నిహితంగా దిగిన ఫొటో పోస్ట్ చేసిన శృతి హాస‌న్‌

క‌మ‌ల్ గారా ప‌ట్టి శృతి హాస‌న్ కెరీర్ ప‌రంగా దూసుకుపోతుంది. కెరీర్ మంచి జోరు మీదున్న స‌మ‌యంలోనే మైకేల్ కోర్స‌లే అనే వ్య‌క్తితో ప్రేమాయ‌ణం కొన‌సాగించి దాదాపు మూడేళ్ల పాటు సినిమాల‌కు దూరంగా ఉంది. అత‌నితో బ్రేక‌ప్ అయిన త‌ర్వాత తిరిగి సినిమాలు మొద‌లు పెట్టింది. త‌మిళంలో లాభం అనే సినిమా చేసిన శృతి రీసెంట్‌గా వ‌కీల్ సాబ్ చిత్రంలోను నటించింది. ఇందులో శృతి హాస‌న్ చేసింది చిన్న పాత్ర అయిన మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. ఇక క్రాక్ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న న‌టించి మంచి పేరు సంపాదించింది.

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ స‌లార్ చిత్రంలోను క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇందులో శృతి పాత్ర ఓ రేంజ్‌లో ఉంటుంద‌ట‌. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శృతి హాస‌న్ తాజాగా అస్క్ టూ మీ అంటూ ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించింది.ఇందులో భాగంగా ఓ నెటిజ‌న్ మీకు ఇష్ట‌మైన ఫొటో షేర్ చేయ‌మంటే త‌న కొత్త బాయ్ ఫ్రెండ్‌తో స‌న్నిహితంగా ఉన్న ఫొటో షేర్ చేసింది. ఇది ఎంతో ఇష్ట‌మైన ఫొటో అని, ఇంత‌వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌లేద‌ని పేర్కొంది. ఇక తనకు ఇష్టమైన సినిమా ది గాడ్‌ ఫాదర్‌, ఎటర్‌నల్‌ సన్‌షైన్‌ అని పంచుకుంది శృతి హాసన్.. తనకు దక్షణాది విందు భోజనం అంటే ఇష్టం అని ఆమె చెప్పుకొచ్చింది.

Advertisement