పాపం మిస్ ఫైర్ అయింది.. శ్రుతీ హాసన్‌కు పరాభవం!!
NQ Staff - October 30, 2020 / 06:08 PM IST

ఒక్కోసారి స్టేజ్ ఎక్కితే ఎవ్వరికైనా తడబాటు తప్పదు. పైగా భాష రాని చోట మాట్లాడాలని ప్రయత్నిస్తే ఇంకాస్త పరువుపోతుంది. అయితే ఇందులోనూ పాజిటివ్ ఉంటుంది. భాష రాకపోయినా ప్రయత్నిస్తోందని పాజిటివ్ యాంగిల్ చూసే వారుంటారు. అలా తాజాగా శ్రుతీ హాసన్‌కు పరాభవం ఎదురైంది. ఏదో చేద్దామని ప్రయత్నించింది. చివరకు తుస్సుమనిపించింది. ఆ సంగతేంటో ఓ సారిచూద్దాం.
https://www.youtube.com/watch?v=UWQu0-UmEQA
ఈ ఆదివారం జీ తెలుగు చానెల్‌లో అదిరిపోయే ఈవెంట్ జరగబోతోంది. ఈ చానెల్‌లో వచ్చే సీరియల్ ఆర్టిస్ట్‌లందరినీ ఒకే చోట చేర్చే జీ తెలుగు కుటుంబం అవార్ట్స్ 2020 ఈవెంట్ జరగబోతోంది. ఇందులో చాలా మంది స్టార్స్ స్పెషల్ ఎంట్రీఇవ్వబోతోన్నారు. రమ్యకృష్ణ, నిధి అగర్వాల్, నమిత, శ్రుతీ హాసన్ వంటి తారలు సందడి చేయబోతోన్నారు. ఈ ఈవెంట్‌లో స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన శ్రుతీ హాసన్ మొదట్లో దెబ్బతింది.
గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన శ్రుతీ హాసన్ పాట పాడేందుకు ప్రయత్నించింది. ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే అనే పాటతో సూపర్ ఎంట్రీ ఇచ్చింది. డ్యాన్సులు వేయకపోవడంతో యాంకర్ ప్రదీప్ అక్కడే సెటైర్ వేశాడు. రేసు గుర్రం స్పందన పాత్ర గుర్తుకు చేస్తూ ఆమె లోపల డ్యాన్స్ వేసిందని కౌంటర్ వేశాడు. నింగి హద్దు నేటికీ లేదోయ్ అంటూ ఏదో పాట పాడబోయింది అయితే లిరిక్స్ గుర్తుకు రాకపోవడంతో మధ్యలోనే వదిలేసింది. దీంతో అందరూ నవ్వేశారు. ఎంత సింగర్ అయినా కూడా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి.