Salaar : సలార్ హిట్ అయితే శృతి హాసన్ పాన్ ఇండియన్ హీరోయిన్

Salaar : సలార్..పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఆయన నటిస్తున్న నాలుగు పాన్ ఇండియన్ సినిమాలలో ఈ సినిమా చాలా డిఫ్రెంట్ స్టోరీతో తెరకెక్కుతోంది. ఉగ్రం సినిమాతో కోలీవుడ్ లో డైరెక్టర్ గా పాపులారిటీ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఏకంగా కేజీఎఫ్ ఛాప్టర్ 1 తో పాన్ ఇండియన్ డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో కేజీఎఫ్ ఛాప్టర్ 2 కూడా తెరకెక్కించాడు. ఈ సినిమా మీద ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

shruthi hasaan is going to be a pan indian heroine with salaar-
shruthi hasaan is going to be a pan indian heroine with salaar-

కన్నడ హీరో యష్ కి ఏకంగా ప్రభాస్ స్థాయిలో పాన్ ఇండియన్ హీరో క్రేజ్ వచ్చేసింది. దాంతో టాలీవుడ్ అగ్ర కథానాయకులందరు ప్రశాంత్ నీల్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఇప్పటికే డార్లింగ్ ప్రభాస్ తో సలార్ తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ ముందెన్నడు కనిపించని విధంగా కొత్త మేకోవర్ తో రానున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమాలోని ప్రభాస్ లుక్ విపరీతంగా ఆకట్టుకుంది. ప్రభాస్ కెరీర్ లో సలార్ మైల్ స్టోన్ మూవీ అవడం గ్యారెంటీ అని చెప్పుకుంటున్నారు.

Salaar : ప్రభాస్ సరసన శృతి హాసన్ ను ఎలా ఎంపిక చేశారు..?

అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఒకటే. ప్రభాస్ సరసన శృతి హాసన్ ను ఎలా ఎంపిక చేశారని. దాదాపు మూడేళ్ళు ఇండస్ట్రీకి దూరంగా శృతి క్రాక్ సినిమాతో ఫాంలోకి వచ్చింది. వకీల్ సాబ్ లో చేసిన రోల్ కూడా బాగా పాపులర్ అయింది. ఇదే ఊపులో సలార్ లో అవకాశం రావడం గొప్ప విషయం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే శృతి హాసన్ కి పాన్ ఇండియన్ రేంజ్ లో క్రేజ్ వచ్చేస్తుందని అంటున్నారు. కాగా ఈ సినిమా 2022 ఏప్రిల్ లో రిలీజ్ కాబోతోంది. తమిళంలో శృతి విజయ్ సేతుపతి తో లాభం అనే సినిమా చేస్తోంది.