Tollywood: సూప‌ర్ మార్కెట్‌లో బాయ్‌ఫ్రెండ్‌కు ముద్దులు.. ఇదేం పాడుప‌ని అంటూ నెటిజ‌న్స్ ఫైర్

Tollywood: క‌మ‌ల్ గారాల ప‌ట్టిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాస‌న్ అతి తక్కువ స‌మ‌యంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంతో పాపులారిటీ తెచ్చుకున్న ఈ అమ్మ‌డు న‌టిగా, సింగ‌ర్‌గా, మంచి డ్యాన్స‌ర్‌గా ఎదుగుతూ కెరీర్ టాప్ పొజీష‌న్‌లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఈ అమ్మ‌డు సినిమాల క‌న్నా ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది.

Shruthi Haasan

కొన్నాళ్ల క్రితం శృతి హాస‌న్ మైఖేల్ అనే వ్య‌క్తితో ప్రేమ‌లో ఉన్నందున సినిమాలు కూడా చేయ‌డం మానేసింది. ఇప్పుడు శాంత‌ను అనే వ్య‌క్తితో స‌న్నిహితంగా ఉంటుంది. అయితే లాక్‌డౌన్ నుండి అతనితో స‌న్నిహితంగా ఉంటున్న శృతి హాస‌న్ ఇద్ద‌రు క‌లిసి దిగిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మ‌డు బాయ్‌ఫ్రెండ్‌ శాంతను హజారికతో కలిసి ముంబైలోని ఓ సూపర్‌మార్కెట్‌లో ప్రత్యక్షమైంది.

అక్క‌డ షాపింగ్ చేయ‌కుండా బాయ్ ఫ్రెండ్‌తో ఫోజులివ్వడానికి సై అంది. శాంతనుకు హగ్గులిస్తూ, పబ్లిక్‌గా ముద్దులు కూడా పెట్టేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో యాడ్‌ చేసింది. ఇది చూసిన జనాలు పబ్లిక్‌గా ఆ ముద్దులేంటి? అని నోరెళ్లబెడుతున్నారు.

Shruthi Haasan

ఈ అమ్మడు తన అభిమానులతో అప్పుడప్పుడు చిట్‌ చాట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవ‌ల ఓ అభిమాని అడిగిన వింత ప్రశ్నకు షాకింగ్‌ సమాధానమిచ్చింది . మీ శరీరంలో మీకు ఏ భాగం అంటే ఇష్టం.. మీ ముక్కు అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా.. అది నిజమేనా’ అని ప్రశ్నించాడు.అందుకు ఈ అమ్మడు సమాధానంగా.. ‘అవును నాకు ముక్కు అంటే ఇష్టమే.. దాని కోసమేగా చాలా డబ్బులు ఖర్చు పెట్టానంటూ’ ఏ మాత్రం తడుముకోకుండా బదులిచ్చింది.

సినీ పరిశ్రమలో కొంచెం గ్యాప్‌ తరువాత రీఎంట్రీలో సక్సెస్‌ సాధించడం అంత సులువు కాదన్న విషయం తెలిసిందే, కానీ శృతి హాస‌న్ మాత్రం రీఎంట్రీని సూప‌ర్ స్పీడ్‌తో కొన‌సాగిస్తుంది. తెలుగులో వకీల్‌సాబ్‌, క్రాక్‌ సినిమాలతో హిట్‌లు అందుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా మూవీ ‘సలార్‌’లో నటిస్తోంది.