Shriya Sharma : జై చిరంజీవ సినిమాలో చిరు మేనకోడలు ఇప్పుడు హీరోయిన్ అని తెలుసా..?
NQ Staff - March 17, 2023 / 02:45 PM IST

Shriya Sharma : సినిమా ఇండస్ట్రీలో చాలామంది చిన్న వయసులో ఆర్టిస్టులుగా పరిచయం అవుతుంటారు. అయితే చిన్నప్పుడు బాగా ఆకట్టుకున్న వారు పెద్దయ్యాక కూడా స్టార్లుగా రాణిస్తుంటారు. కానీ కొందరు మాత్రం పెద్దయ్యాక సినిమాలకు దూరంగా ఉంటారు. ఇలా పెద్దయ్యాక సినిమా స్టార్లు అవుతున్న వారి సంఖ్య ఈ నడుమ బాగానే పెరుగుతోంది.
ఇప్పుడు కూడా ఓ అమ్మాయి పెద్దయ్యాక హీరోయిన్ గా మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలో చిరు మేకోడలుగా నటించిన అమ్మాయి మీకు గుర్తుండే ఉంటుంది. కథ మొత్తం ఆ చిన్నారి చుట్టూ తిరుగుతుంది. ఆ అమ్మాయి పాత్రలో నటించింది శ్రియ.

Shriya Sharma Latest Cute Photos
దూకుడు సినిమాలో..
ఈ సినిమాతో పాటు రచ్చ, ఎటో వెళ్లిపోయింది మనసు. తూనీగ, తూనీగ లాంటి సినిమాల్లో చిన్నప్పటి పాత్రల్లో నటించింది.

Shriya Sharma Latest Cute Photos
అలాగే తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్టుగా బాగానే నటించింది. ఇక దూకుడు సినిమాలో కూడా సమంత చెల్లెలుగా నటించింది ఈ భామ.

Shriya Sharma Latest Cute Photos
శ్రీకాంత్ కొడుకు రోషన్ తో కలిసి నిర్మలా కాన్వెంట్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. అయితే ప్రస్తుతం ఆమె న్యాయవిద్యను పూర్తి చేసి ప్రస్తుతం లాయర్ గా చేస్తోంది. ఆమెది ఉత్తర ప్రదేశ్.

Shriya Sharma Latest Cute Photos
తండ్రి ఇంజినీర్, తల్లి డైటీషియన్. శ్రియ నాలుగో ఏట నుంచే యాక్టర్ గా మారి పోయింది. అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటుంది. మరి లా ప్రాక్టీస్ తర్వాత ఎంట్రీ ఇస్తుందో చూడాలి.