Shriya: శ్రియ దాచిన ర‌హ‌స్యం.. ఏడాది పూర్తైందంటూ ఫొటోలు షేర్ చేసిన ముద్దుగుమ్మ‌

Shriya: అందాల ముద్దుగుమ్మ శ్రియ ఇటీవ‌లి కాలంలో ఎంతగా ర‌చ్చ చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. . ఒకప్పుడు టాలీవుడ్ లో ఈ అమ్మడిదే హవా అంతా.. స్టార్ హీరోలందరి సరసన నటించి చిరకాల గుర్తింపు తెచ్చుకుంది శ్రియ. అయితే ఈ అమ్మ‌డు సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవ‌డంతో పాటు బిడ్డ‌ను కూడా సీక్రెట్‌గా కనేసింది. కొద్ది రోజుల త‌ర్వాత త‌న‌కు పాప పుట్టిన విష‌యాన్ని తెలియ‌జేసింది.

shriya shares herbaby pics
shriya shares herbaby pics

శ్రియాకు బిడ్డ పుట్టింది అనే విషయాలు అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాయి. శ్రియా, ఆండ్రూలు ఆ విషయాన్ని ప్రకటించేంత వరకు ఎవ్వరికీ తెలియదు. సడెన్‌గా తమ పాపను చూపించారు. రాధ అంటూ పరిచయం చేశారు. తనే మా పాప అని కొన్ని ఫోటోలను చూపించారు. శ్రియ గర్భంతో ఉన్న ఫోటోలు, లాక్డౌన్‌లో గర్భందాల్చిందంటూ చెప్పేశాడు ఆండ్రూ.

shriya shares herbaby pics
shriya shares herbaby pics

శ్రియా తాజాగా ఓ వీడియోను షేర్ చేస్తూ తన సీక్రెట్ కు ఏడాది పూర్తయినట్టు తెలిపింది. లాక్ డౌన్ లో భర్తతో పాటు విదేశాల్లో గడిపిన శ్రియ ఒకరోజు హఠాత్తుగా బేబీతో కన్పించి షాక్ ఇచ్చింది. లాక్ డౌన్ లోనే పాప పుట్టినట్టు మరో వీడియోలో వెల్లడించింది. అప్పటి వరకూ ఆ విషయంలో చాలా సీక్రెట్ మైంటైన్ చేసింది. తాజాగా తన పాపకు ఏడాది పూర్తయ్యింది అంటూ కొన్ని వీడియోలు, ఫోటోలు షేర్ చేసింది శ్రియా.

shriya shares herbaby pics
shriya shares herbaby pics

ఆ వీడియోలో శ్రియ పాపతో సరదాగా గడుపుతూ కన్పించింది. “మీరు ఇంకా ఆమెను కలవలేదు.. ఆమెకు మీ ప్రేమను అందించండి. ఆమె ప్రతిచోటా స్నేహితులను సంపాదించుకోవాలని, విశ్వం నుండి ప్రేమను పొందాలని, అదృష్టం, ఆనందం ఆమె ఉత్తమ స్నేహితురాలు కావాలని నేను ప్రార్థిస్తున్నాను” అంటూ బేబీపై ప్రేమను కురిపించింది ఈ స్టార్ మామ్.

shriya shares herbaby pics
shriya shares herbaby pics

ఈ ప్రయాణం ఎంతో అద్బుతంగా ఉంది. భయపడకుండా ధైర్యంగా ఉండమని సుపర్నా మొయిత్రా చెప్పింది.. రాధ సేమ్ ఆండ్రూలా ఉందని రియాజ్ అన్నాడు.. ఇలా చాలా మందిని ఇంకా రాధ కలవాల్సి ఉంది.. ఆమెను కలవాల్సిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు.. ఆమె ఎక్కడున్నా మంచి స్నేహితులను ఏర్పర్చుకోవాలి.. ఆమెకు అనంతమైన ప్రేమ లభించాలని కోరుకుంటున్నాను’ అని తన కూతురి గురించి శ్రియా చెప్పుకొచ్చారు