Shriya టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా శ్రియా తిరుగులేని ఫాలోయింగ్ దక్కించకుంది. దశాబ్దకాలంపాటు టాప్ ప్లేస్‌లో చక్రం తిప్పిన శ్రియా ఆ తరువాత ఫాం కోల్పోయింది. సీనియర్స్, జూనియర్స్ అని తేడా లేకుండా అందరు హీరోలతో జత కట్టింది. హిట్లు కొట్టింది. చిరు, నాగ్, వెంకీ, బాలయ్య ఇలా అందరితోనూ కలిసి నటించింది. ఆ సమయంలో రైజింగ్‌లో కుర్ర హీరోలతోనూ శ్రియా నటించి సూపర్ జోడి అనిపించుకుంది.
మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, తరుణ్, ఉదయ్ కిరణ్, రాజా ఇలా వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా అక్కడా ఇక్కడా అనే బేధం లేకుండా అన్ని ఇండస్ట్రీలోనూ నటించింది. ,సౌత్ స్టార్‌గా శ్రియా మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే శ్రియ ఇప్పుడు సెకండ్ హీరోయిన్‌గానే మాత్రమే సీనియర్ హీరోల పక్కన నటిస్తోంది. అది కూడా వెంకటేష్, నాగార్జునలు మాత్రమే శ్రియాను ఎంచుకుంటున్నారు.
శ్రియా చేతిలో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఒక్కటే భారీ ప్రాజెక్ట్. అది కూడా ఓ వెబ్ సిరీస్ కూడా ఉంది. అయితే శ్రియాకు సినిమా అవకాశాలు తక్కువగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం రచ్చ మామూలుగా ఉండదు. రష్యన్ భర్తతో కలిసి శ్రియా చేసే సరదాలు, సరసాలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. భర్తకు ఘాటు ముద్దులు పెడుతూ నెటిజన్లకు సెగలు పుట్టిస్తోంది.
బ్యాక్ మొత్తం వదిలేసిన శ్రియ: Shriya
ఇక హాట్ హాట్ ఫోటోలను షేర్ చేయడంలోనూ శ్రియా వెనకడుగు వేయదు. తాజాగా కొన్ని స్టిల్స్‌ను షేర్ చేసింది. మాస్క్‌లు అవసరం లేని నాటి రోజుల్లో ఇలా ఉండేందంటూ ఒకప్పటి ఫోటోలను షేర్ చేసింది. ఇందులో శ్రియ తన వీపు అందాలను ప్రదర్శించింది. మొత్తానికి అందాల ఆరబోతలో తాను వెనకాడబోనని దర్శక నిర్మాతలకు ఇలా పరోక్షంగా హింట్ ఇస్తోంది.