Shriya: కూతురితో శ్రియ భ‌లే ఎంజాయ్ చేస్తుందిగా..!

Shriya: ఒక‌ప్పుడు టాప్ హీరోలు అంద‌రితో ఆడిపాడిన శ్రియ ఇప్పుడు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తుంది. పెళ్లి త‌ర్వాత ఈ అమ్మ‌డు కాస్త స్పీడ్ త‌గ్గించింద‌నే చెప్పాలి. వ్యాపారవేత్త ఆండ్రూ కొశ్చివ్‌ను 2018లో వివాహం చేసుకున్నారు శ్రియ. 2020లో శ్రియ ఓ పాపకు జన్మనిచ్చారు. ఆ పాప పేరు ‘రాధ’ అని శ్రియ ఓ సందర్భంలో చెప్పారు.

shriya playing with her daughter
shriya playing with her daughter

కూతురు క‌న్న విష‌యాన్ని దాదాపు ఏడాదిగా రహస్యంగా ఉంచిన శ్రియ ఇటీవ‌ల సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారామె. తాను తల్లయిన విషయాన్ని పంచుకున్నారు. ‘‘గత ఏడాది ప్రపంచం అంతా కరోనా ప్రభావంతో గందరగోళ పరిస్థితుల్లో ఉంది. కానీ ఆ క్వారంటైన్‌ సమయంలో మా ప్రపంచమే మారిపోయింది. అడ్వెంచర్, ఎగ్జైట్‌మెంట్, లెర్నింగ్‌తో మా ప్రపంచం నిండిపోయింది. మా జీవితాల్లోకి ఓ ఏంజిల్‌ వచ్చింది. ఆ దేవుడికి ధన్యవాదాలుఅని రాసింది.

తన కూతురికి రష్యన్ సాంప్రదాయం ప్రకారం కాకుండా హిందూ మతానికి చెందిన పేరు పెట్టింది. తన కూతురికి `రాధ` అనే పేరు పెట్టడం వెనుక గల కారణాన్ని శ్రియ వెల్లడించింది. `నాకు ప్రసవం అయిన తర్వాత మా అమ్మకి ఫోన్ చేశాను. నాకు ఆడపిల్ల పుట్టిందనే విషయం తెలుసుకున్న అమ్మ.. `అయితే రాధా రాణి వచ్చేసిందన్న మాట` అని యథాలాపంగా అంది.

ఆ మాటలు విన్న ఆండ్రీ.. `ఆమె రష్యన్ భాషలో ఏమి చెప్పింది` అని అడిగాడు. దానికి నేను.. `ఆమె రష్యన్ మాట్లాడలేదు.. మన పాపను రాధా రాణి అని పిలిచింద`ని చెప్పాను. దాంతో `రష్యన్ భాషలో `రాధ` అంటే సంతోషం అనే అర్థముంద`ని ఆండ్రీ చెప్పాడు. దాంతో పాపకు ఆ పేరు పెట్టామ`ని శ్రియ చెప్పింది.

అయితే కూతురు పుట్టిన త‌ర్వాత శ్రియ ఆమెతో తెగ సంతోషంగా గడుపుతుంది. స‌ర‌దాలు షికార్ల‌కి వెళుతూ తెగ ర‌చ్చ చేస్తుంది. తాజాగా స‌ముద్రంలో కూతురితో ఆడుతున్న వీడియో ఒకటి బ‌య‌ట‌కు రాగా, అది చూసి అంద‌రు మురిసిపోతున్నారు.