Shriya: శ్రియ ప్రైవేట్ పార్ట్‌పై ప‌బ్లిక్‌గా ముద్దుపెట్టిన భ‌ర్త‌.. సెటైర్స్ వేస్తున్న‌నెటిజ‌న్స్

Shriya: శ్రియ శ‌ర‌న్.. ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్. పెళ్లైన త‌ర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ కుర్ర హీరోయిన్‌లతో సమానంగా అందాలను ఆరబోస్తూ వార్త‌ల‌లోకి ఎక్క‌తుంది. వెండితెరపై తనకంటూ ప్రత్యకత తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చూడడానికి అమాయకంగా కనిపిస్తూ అభిమానుల మనసులను తన అందచందాలతో కొల్లగొడుతూనే ఉంది. తెలుగు తెరతో పాటు సౌత్ ఇండియా తెరలన్నింటినీ తన అందాలతో ఓ ఊపు ఊపేసిన శ్రీయ.. స్టార్ హీరోలందరితో రొమాన్స్ చేసింది.

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉన్న శ్రియ 2018 సంవత్సరంలో ఆండ్రీ కోస్చీవ్‌‌ని సీక్రెట్‌గా పెళ్ళాడింది. ఆయ‌న‌ను వివాహం చేసుకున్న త‌ర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. కాకపోతే సోషల్ మీడియాలో వేదికగా మాత్రం అభిమానులతో టచ్‌లో ఉంటూ నెట్టింట మంట పుట్టిస్తుంది. ఒక‌వైపు హాట్ షో మ‌రోవైపు త‌న భ‌ర్త‌తో రొమాన్స్‌కి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది.

శ్రియ ప్ర‌స్తుతం త‌న కెరీర్ క‌న్నా కూడా ఎంజాయ్‌మెంట్‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తుంది. త‌న భర్త ఆండ్రీ కోస్చీవ్ తో షికార్లు చేస్తూ వాటికి సంబంధించిన విష‌యాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన షేర్ చేసిన ఓ క్లిప్ చూసి నెటిజన్స్ షాకవుతున్నారు. ఈ వీడియోలో శ్రీయతో ఆయన రొమాన్స్ పీక్స్ స్టేజ్‌లో ఉండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

బీచ్ ఒడ్డున, పబ్లిక్ ప్రదేశాల్లో రొమాన్స్ చేయడం శ్రీయ- ఆండ్రీ కోస్చీవ్‌‌ జోడీకి కొత్తేమీ కాదు. కాని ఇప్పుడు మాత్రం ఓ బోటుని అద్దెకు తీసుకొని అందులో రొమాన్స్‌తో రెచ్చిపోయారు. కొశ్చివ్ ఒళ్ళో కూర్చున్న శ్రియ తన భర్తకు పలు చిలిపి ప్రశ్నలు సంధించింది. ఓ వీడియోలో నాలో నీకు బాగా కోపం తెప్పించే అంశం ఏంటి అని కొశ్చివ్ ని శ్రీయ సరదాగా అడిగింది. పలుమార్లు ఈ ప్రశ్న రిపీట్ చేసింది. దీనికి కొశ్చివ్ స‌రైన స‌మాధానం ఇచ్చాడు.

శ్రియ ప్ర‌శ్ర అడిగిన వెంట‌నే కొశ్చివ్ ఆమె ఎదపై ఘాటుగా ముద్దు పెట్టేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. వీరిద్దరి బహిరంగ రొమాంటిక్ వ్యవహారం చూసి నెటిజన్లు షాకైపోతున్నారు. నెటిజ‌న్స్ సెటైర్స్ కూడా వేస్తున్నారు. ఇక శ్రీయ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం RRR మూవీలో కీలకపాత్ర పోషిస్తోంది. రాజమౌళి రూపొందిస్తున్న ఈ భారీ మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఆమె కనిపించనుంది. శ్రియ రెండో ఇన్నింగ్స్‌లో రెచ్చిపోవాల‌ని భావిస్తుంది.