Salaar : కేజీఎఫ్ 2 హిట్ సలార్ పై ఎంత ప్రభావం చూపిందో తెలుసా!
NQ Staff - January 20, 2023 / 03:25 PM IST
Salaar : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ చిత్రీకరణ తిరిగి ప్రారంభం అయింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గతంలో షూట్ చేసిన కొన్ని సన్నివేశాలను ఇప్పుడు మళ్లీ భారీ టెక్నికల్ వాల్యూస్ మరియు తారాగణంతో రీ షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
కేజీఎఫ్ 2 సినిమా విడుదలకు ముందు సలార్ సినిమా కన్ఫమ్ అయ్యింది. ఆ సమయంలో దాదాపుగా 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో సలార్ ని తెరకెక్కించాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావించాడట. ఎప్పుడైతే కేజీఎఫ్ 2 సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లను నమోదు చేసిందో అప్పుడే సలార్ సినిమా యొక్క బడ్జెట్ భారీగా పెంచేశారు.
కన్నడ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సలార్ సినిమా కోసం ఏకంగా 400 కోట్ల రూపాయల బడ్జెట్ను ఖర్చు చేయబోతున్నారట. హంబుల్ ఫిలిం మేకర్స్ వారు ఖర్చుకు వెనకాడకుండా సలార్ సినిమాను నిర్మిస్తున్నారని తెలుస్తోంది.
ప్రభాస్ కి ఉన్న మార్కెట్ మరియు కేజీఎఫ్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్‌కి దక్కిన పాన్ ఇండియా స్టార్ డం కారణంగా సలార్ సినిమా యొక్క బడ్జెట్ అమాంతం పెంచారని సమాచారం అందుతుంది. కే జీ ఎఫ్ 2 1000 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసిన కారణంగానే సలార్ యొక్క బడ్జెట్ అమాంతం పెంచినట్లుగా కన్నడ మీడియాకు హంబుల్ ఫిలిమ్స్ వారు ఆఫ్ ది రికార్డ్ తెలియజేశారట.
కేవలం సలార్ సినిమాకు మాత్రమే కాకుండా భవిష్యత్తులో హంబుల్ ఫిలిమ్స్ నుండి రాబోతున్న అన్ని సినిమాలకు కూడా వందల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్లుగా వారు తెలియజేశారు. ఈ ఏడాదిలోనే సలార్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో వెయ్యి కోట్ల సినిమాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.