Tollywood: ఏపీలో అద‌న‌పు షోల‌కు అనుమ‌తి లేదు.. అంద‌రి విష‌యంలో ఒకే నిర్ణ‌యం

Tollywood: గ‌త కొద్ది రోజులుగా ఏపీలో సినిమా టిక్కెట్ వ్య‌వ‌హారం పెద్ద చర్చ‌నీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ రేట్ల పెంపు వ్యవహారం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని థియేటర్లకు ఆన్‌లైన్ టిక్కెట్ విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుబడుతున్న విషయం మనకు తెలిసిందే.

shocking news to tollywood3
shocking news to tollywood3

పోర్టల్ లైవ్ అయిన తర్వాత మాత్రమే టికెట్ రేట్ల విషయంలో ఇప్పటివరకు వివాదాస్పదంగా ఉన్న సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం సూచించింది. పరిశ్రమ పెద్దలు సైతం ఈ సమస్య నుంచి బయట పడడానికి వేరే మార్గం లేకపోవడంతో ఈ ప్రతిపాదనకు అంగీకరించినప్పటికీ, ఏర్పాటు కానున్న వ్యవస్థపై వారి భయాలు వారికి ఉన్నాయి.

నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్, బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ, అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా కూడా డిసెంబర్ నెలలో విడుదల కావాల్సి ఉంది. టికెట్ రేట్లు గురించి వీరంంతా ఎదురు చూస్తుండ‌గా, తాజాగా క్లారిటీ వ‌చ్చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని తప్పసరి చేస్తూ.. రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసింది. ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ ఎమెండ్మెంట్ బిల్ ను మంత్రి పేర్ని నాని సభలో ప్రవేశ పెట్టారు. ఈ సవరణ ప్రకారం ప్రభుత్వ సంస్థ ఆన్ లైన్ బుకింగ్ ప్లాట్ ఫామ్ ద్వారానే టికెట్ కొనాలి.

shocking news to tollywood2
shocking news to tollywood2

థియేటర్స్ లో ఇకనుంచి టికెటింగ్ కు అనుమతి లేదు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ తరపున బిల్లును ప్రవేశపెడుతూ.. రాష్ట్ర సమాచార ప్రజాసంబంధాల శాఖామాత్యులు పేర్ని నాని బిల్లు లక్ష్యాల్ని, ప్రకటనను చదివి వినిపించారు.సినిమా ఏదైనా నాలుగు షోలే, ఏపీలో అద‌న‌పు షోల‌కి అనుమ‌తి లేదు, చిన్నా, పెద్దా హీరోలంద‌రికీ ఒక‌టే రూలు, టికెట్ రేట్లు కూడా పెంచ‌డానికి వీల్లేదు అంటూ వారు తెలిపారు