Bigg Boss: బిగ్ బాస్ 5 తెలుగులో ఊహించని కంటెస్టెంట్.. నోరెళ్లపెడుతున్న నెటిజ‌న్స్..!

Bigg Boss: బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ప్ర‌పంచ‌మంతా ఉన్న ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. ఇప్పుడు ఈ షో అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో స‌క్సెస్ ఫుల్‌గా దూసుకుపోతుంది. తెలుగులోను స‌క్సెస్ ఫుల్ గా న‌డుస్తున్న ఈ కార్య‌క్రమం క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. నాలుగో సీజ‌న్ కూడా క‌రోనా వ‌ల‌న కొద్ది రోజుల వాయిదా ప‌డ‌గా,ఇప్పుడు ఐదో సీజ‌న్‌కి కూడా అదే ప‌రిస్థితి ఎదురైంది. ఆగస్ట్ రెండో వారం నుంచి స్టార్ట్ చేయాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Bigg Boss

ఇప్ప‌టికే కంటెస్టెంట్స్‌ని జూమ్ ద్వారా ఎంపిక చేసిన‌ట్టు ప్రచారం జ‌రుగుతుండ‌గా, ఇందులో ఎవ‌రు ఊహించని కంటెస్టెంట్ పేరు ఒక్క‌టి హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. యూ ట్యూబ్ సెన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్ సహా మరో 10 మంది పేర్లు కూడా బాగానే వినిపిస్తున్నాయి. ఈ సారి స్టార్ క్యాస్టింగ్ కూడా బాగానే కనిపిస్తుంది. చాలా మంది కాంట్రవర్సీ పర్సన్స్ నే ఈ సారి షోలోకి పిలుస్తున్నట్లు తెలుస్తుంది.

Bigg Boss

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సురేఖా వాణి లాంటి సీనియర్ నటీమణులను కూడా బిగ్ బాస్ లోకి ఆహ్వానిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే అనుకోని విధంగా కమెడియన్ అలీ ఈ సారి బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌బోతున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం న‌డుస్తుంది. . ఇండస్ట్రీలో 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఈయన.. 1000 సినిమాలకు పైగానే నటించాడు.

ఆలీని బిగ్ బాస్ షోకి తీసుకొస్తే ఎలా ఉంటుంద‌ని నిర్వాహ‌కులు ఆలోచ‌న‌లు చేస్తున్నారు. ఆయ‌న‌తో సంప్ర‌దింపులు కూడా జ‌రిపార‌ట‌. కచ్చితంగా అలీ వస్తే షో రేంజ్ కూడా పెరుగుతుందని.. ఆయన లాంటి ఓ లెజెండరీ కమెడియన్ ఇంట్లోకి వెళ్తే టిఆర్పీ కూడా భారీగానే పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఎలాగైనా సరే అలీని ఒప్పించాలని కంకణం కట్టుకున్నారు స్టార్ మా యాజమాన్యం. దీనికోసం అలీకి భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేస్తున్నారు.

Bigg Boss

కాని వంటి బిజీ యాక్ట‌ర్ బిగ్ బాస్ షోకి వ‌స్తాడా అని చాలా మంది ఆశ్చర్యం వ్య‌క్తం చేస్తున్నారు.ఇది ముమ్మాటికి అస‌త్యం అని కొంద‌రు నెటిజ‌న్స్ అనుకుంటుండ‌గా, మరి కొంద‌రు బిగ్ బాస్ షోలో ఏదైన జ‌ర‌గ‌వ‌చ్చుఅని చెప్పుకొస్తున్నారు. కాగా, అలీ ఈ మ‌ధ్య ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. బుల్లితెరపైనే బిజీ అవుతున్నాడు.

ఓ వైపు యమలీల సీరియల్ తో పాటు అలీతో సరదాగా లాంటి షోలు చేస్తున్నాడు. వీటికి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి బిగ్ బాస్ లోకి రావాలంటూ ఈయనకు ఆహ్వానం పలుకుతుంది స్టార్ మా. దానికోసం ఊహించని పారితోషికం కూడా ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మ‌రి రానున్న రోజుల‌లో ఎలాంటి ట్విస్ట్ చూస్తుందో బిగ్ బాస్ యాజ‌మాన్యం.