KV ANAND: ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడి మృతి వెనుక సంచ‌ల‌న నిజం.. పార్ధివ దేహాన్ని తీసుకొచ్చేందుకు సూర్య ప్ర‌య‌త్నాలు

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కేవీ ఆనంద్ మ‌ర‌ణించింది గుండెపోటుతో కాదా? ఇప్పుడు ఇలాంటి అనుమానం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా..? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది మరి. నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న మనిషి ఉన్నపళంగా గుండెపోటుతో మరణించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న లెజెండరీ సినిమాటోగ్రఫర్, ప్రముఖ దర్శకుడు కె.వి.ఆనంద్ మరణం సౌత్ సినిమాను కలచివేస్తుంది. ఆయన మరణవార్త తెలుసుకున్న వెంటనే సినీ రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.

అయితే ఈయన తీవ్రమైన గుండెపోటుతో మరణించాడని వార్తలు వస్తున్నాయి. కానీ మరణించే సమయానికి ఈయనకు కరోనా ఉందనే కొత్త విషయం ఎప్పుడు బయటికి వచ్చింది. నిజానికి రెండు వారాల కింద కె.వి.ఆనంద్ భార్య, కూతురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో వాళ్లు క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు. ఈయన కూడా ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఈ క్రమంలోనే కె.వి.ఆనంద్ కు శ్వాస సంబంధిత సమస్యలు వచ్చాయి. దానికి తోడు గుండెల్లో నొప్పి కూడా రావడంతో స్వయంగా తాను కారు డ్రైవ్ చేసుకుంటూ ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళాడు.

అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని గంటల్లోనే తీవ్రమైన గుండె నొప్పి రావడంతో మరణించాడు. అదే సమయంలో ఆయన శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడినట్లు వైద్యులు తెలిపారు. హాస్పిటల్ కు వచ్చినప్పుడే ఆయనలో కరోనా లక్షణాలు కనిపించాయని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. మరణించిన తర్వాత ఆయన టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ అని రిపోర్ట్స్ వచ్చాయి. దాంతో ఆయన భౌతిక కాయాన్ని నేరుగా బీసెంట్ నగర్ స్మశాన వాటికకు తరలించారు. అక్కడే ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కుటుంబ సభ్యులకు మాత్రమే ఆయన చివరిసారిగా చూసుకోడానికి అనుమతి ఇచ్చారు. ఈ విషయం తెలిసిన తరువాత సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఒక మంచి దర్శకుడిని కరోనా కాటేసింది అంటూ వాపోతున్నారు. పార్ధివ దేహాన్ని ఫ్యామిలీకి అప్ప‌గించేందుకు సూర్య ఎంత ప్ర‌య‌త్నించిన అది కుద‌ర‌లేదు. ఏదేమైనా కూడా కె.వి.ఆనంద్ హార్ట్ ఎటాక్ తో కాదు కరోనా లక్షణాలతోనే కన్నుమూశారని తెలుస్తోంది.

Advertisement