Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ లోకి శివాజీ భార్య, చిన్న కొడుకు.. తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పిన శోభాశెట్టి..!
NQ Staff - November 13, 2023 / 09:44 AM IST

Bigg Boss 7 Telugu :
బిగ్ బాస్ లో పదో వారం చాలా ఎంటర్ టైనింగ్ గా ఎమోషనల్ గా సాగుతోంది. ఎందుకంటే ఈ వారం మొత్తం ఫ్యామిలీ విజిటింగ్ లను పెట్టేశాడు బిగ్ బాస్. దాంతో అందరి ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంకేముంది హౌస్ మేట్స్ మొత్తం చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. తమ ఇంట్లో వారిని చూసి చాలా హ్యాపీగా ఉండిపోయారు. ఇక పదో వారం ఎండింగ్ అంటే ఆదివారం చాలా ఫన్నీగా సాగిపోయింది. ఎందుకంటే ఆదివారం దీపావళి స్పెషల్ ఎపిసోడ్ నిర్వహించారు. అందరూ ట్రెడీషనల్ డ్రెస్సుల్లో మెరిశారు. నాగార్జున కూడా చాలా సంప్రదాయబద్దంగా కనిపించారు.
ఇక ఆదివారం నాడు హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా ఇంట్లోకి తీసుకొచ్చారు నాగార్జున. ముందుగా శివాజీ భార్యను, చిన్న కొడుకు రిక్కీని స్టేజి మీదకు తీసుకువచ్చారు. తన భర్తతో కనీసం ఫోన్ మాట్లాడకుండా కూడా తాను ఇన్ని రోజులు ఉండలేదని చెప్పి ఎమోషనల్ అయిపోయింది. ఆమె మాటలకు శివాజీ కూడా కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక రిక్కీ మాట్లాడుతూ.. భోలే అన్నా అన్నాడు. అన్నయ్య కాదురా బాబాయ్ అంటూ శివాజీ చెప్పాడు. ఆయన బాబాయ్ కాదు నాన్న హీరో నాన్న అంటూ రిక్కీ అన్నాడు. దానికి శివాజీ కూడా హో.. అంటూ గట్టిగా అరిచేశాడు.
దానికి అందరూ నవ్వేశారు. ఇక మధ్యలో వివిధ రకాల కలర్స్ ఉండే చాక్లెట్లను ఇచ్చాడు బిగ్ బాస్. అందులో ఎక్కువ కలర్స్ వచ్చిన అమర్ దీప్, రతిక రోజ్ లకు ఇంకా బాగా ఆడాలని చెప్పారు. తర్వాత శోభాశెట్టి తన ప్రియుడి గురించి రివీల్ చేసింది.

Shivaji Got Emotional Seeing His Wife
మూడేళ్లుగా యశ్వంత్ రెడ్డి అనే వ్యక్తితో తానే డేటింగ్ లో ఉన్నట్టు తెలిపింది. అతన్ని ముద్దుగా తాను పాపు అని పిలిచుకుంటానని వివరించింది. ఆ తర్వాత ఎపిసోడ్ లోకి వరుసగా గెస్ట్ లు వచ్చారు. శ్రీలీల-వైష్ణవ్ తేజ్ వచ్చి కొంచెం సేపు సరదాగా ఎంటర్ టైన్ చేశారు. తర్వాత మిగతా వారి ఫ్రెండ్స్ ను కూడా పిలిచాడు స్టేజ్ మీదకు.
ఇందులో వారు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అర్జున్ సోదరుడు, తల్లిని పిలిచారు. తర్వాత గౌతమ్ సోదరుడిని కూడా పిలిచారు. ఇక ప్రిన్స్ యావర్ సోదరుడితో పాటు ఇమ్మాన్యూల్ కూడా స్టేజి మీదకు వచ్చాడు. మధ్యలో అమర్ దీప్ తల్లి రావడంతో అతను చాలా ఎమోషనల్ అయ్యాడు.

Shivaji Got Emotional Seeing His Wife
హైపర్ ఆది వచ్చి కాసేపు తన పంచ్ లతో ఎంటర్ టైన్ చేశాడు. బుచ్చిబాబు కూడా హౌస్ లోకి వచ్చి అర్జున్ కు తన సినిమాలో క్యారెక్టర్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు. ఇక చివరకు భోలే షావలి ఇంటి నుంచి ఎలిమినేట్ అయిపోయాడు.