Bigg Boss 7 Telugu : తేలిపోయిన బిగ్ బాస్ విన్నర్.. పదో వారంలో క్లారిటీ వచ్చేసింది..!
NQ Staff - November 12, 2023 / 11:45 AM IST

Bigg Boss 7 Telugu :
బిగ్ బాస్ సీజన్-7 మొదలైనప్పటి నుంచి అంతా ఉల్టా పల్టా కాన్సెప్ట్ మీదనే నడుస్తోంది. ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎవరు కెప్టెన్ అవుతారో కూడా ఊహించడం కష్టంగానే మారిపోయింది. అందుకే ఈ సారి సీజన్ బాగానే ఆకట్టుకుంటోంది. అంతకు ముందు లాగా కాకుండా ఈ సారి ఒకరిద్దరిని హైలెట్ చేయకుండా అందరూ ఎవరికి వారే సాటి అన్నట్టే ఆడుతున్నారు. అందుకే ఈ సీజన్ లో కెప్టెన్ ఎవరో చెప్పడం అందరికీ కష్టంగానే మారిపోయింది. ఇక పదో వారం మొత్తం హౌస్ లో ఫ్యామిలీ విజిటింగ్ ను పెట్టారు. అందరి ఇంటి సభ్యులు వచ్చి ఎమోషనల్ అయ్యారు.
ఇక పదో వారం కెప్టెన్సీ టాస్క్ లో ఓ విషయం బయట పడింది. అసలు ఎవరు ఈ సీజన్ విన్నర్ అనే దానికి క్లారిటీ వచ్చేసింది. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా కన్‌ఫెషన్ రూమ్‌లో శివాజి, అర్జున్ పేరుతో రెండు కిరీటాలను పెట్టారు. వీకిద్దరూ ఫైనల్ కంటెండర్లుగా నిలిచారు. అయితే ప్రతి కంటెస్టెంట్ కన్ ఫెషన్ రూమ్ లోకి వెళ్లి ఎవరు కెప్టెన్ అవుతారో చెప్పాలి. కారణాలు కూడా వివరించాలి. నచ్చని పోటీ దారు కిరీటం నుంచి ఒక రత్నాన్ని తీసేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ ఇచ్చాడు నాగార్జున. అయితే ప్రస్తుతం హౌస్ లో ఉన్న 11 మందిలో ఇద్దరు పోటీదారులు మినహా మిగిలిన కంటెస్టెంట్లు అందరూ ఓట్లు వేశారు.
ఇక్కడ విచిత్రం ఏంటంటే అందరూ శివాజీకై యునామినస్ గా జై కొట్టారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఇలా అందరు కంటెస్టెంట్లు ఓట్లేసిన కంటెస్టెంట్ ఎవరూ లేరు. మొదటి వ్యక్తిగా శివాజీ రికార్డు సృష్టించాడు. అతను ఆరో హౌస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు హౌస్ కంటెస్టెంట్లు అందరూ ఇలా ఒకే విధంగా ఓట్లేయలేదు. పైగా ఒక్కొక్కరినే కన్ ఫెషన్ రూమ్ లోకి పిలిచాడు బిగ్ బాస్. ఒకరు చెప్పింది మరొకరికి అస్సలు తెలియదు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అందరూ శివాజీకే ఓట్లు గుద్దారు. దాన్ని బట్టి అందరి మనసులు శివాజీ గెలుచుకున్నాడన్నమాట.
దీంతో షో మొత్తంలో ఏకగ్రీవంగా ఎన్నికైన కెప్టెన్ గా శివాజీ రికార్డు సృష్టించాడు. ఇలా హౌస్ లోని అందరి మనసులను శివాజీ గెలిచాడు అంటే.. ఇక ప్రేక్షకుల మనసులు గెలవడం పెద్ద విషయం ఏమీ కాదు. కాబట్టి దీన్ని బట్టి ఈ సీజన్ లో విన్నర్ అయ్యేందుకు శివాజీకి అన్ని అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Shivaji Chances As Bigg Boss 7 Telugu Winner
మొన్న ఆర్మాక్స్ మీడియా చేసిన సర్వేలో కూడా శివాజీ అందరికంటే ముందు వరుసలో ఉన్నాడని తేలిపోయింది. అతని తర్వాత స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. కానీ పల్లవి ప్రశాంత్ ప్రతిసారి శివాజీ మాటలు మాత్రమే వింటాడు. ఏ విషయంలో అయినా శివాజీ సలహాలే పాటిస్తాడు కాబట్టి.. ఈ సారి శివాజీకి పోటీ లేదని తేలిపోయింది.