Shiva shankar master: శివశంకర్ మాస్టర్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులని కోరా: మంచు విష్ణు

Shiva shankar master: పది భాషల్లో వెయ్యి సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసిన శివ శంకర్ మాస్టర్ ఆర్థికంగా ఇంత దయనీయ స్థితిలో ఉంటారని ఎవరూ ఊహించి ఉండరు. 1975లో శివ శంకర్ మాస్టర్ ప్రస్థానం మొదలు కాగా.. మూడు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తున్నాడు.

TheNewsQube-
siva shankar master needs hepls
siva shankar master needs hepls

మగధీర చిత్రంలోని ‘ధీర ధీర..’ సాంగ్ ని శివ శంకర్ మాస్టర్ కంపోజ్ చేశారు. ఈ పాటకు జాతీయ అవార్డు దక్కింది. కెరీర్ లో మొదటిసారి మగధీర సినిమాకు జాతీయ అవార్డు గెలుపొందాడు శివ శంకర్ మాస్టర్. ఇండియన్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన బాహుబలి చిత్రానికి కూడా శివశంకర్ మాస్టర్ పని చేశారు. న‌టుడిగా కూడా తెలుగు, తమిళ బాషలలో నటించారు.

ముప్పైకి పైగా సినిమాలలో శివ శంకర్ మాస్టర్ నటించడం విశేషం. తెలుగులో సుడిగాడు, నేనే రాజు నేనే మంత్రి, రాజుగారి గది 3, ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాల్లో నటించారు. అనేక డాన్స్ రియాలిటీ షోలకు శివ శంకర్ జడ్జిగా ఉన్నారు. అలాగే సీరియల్ నటుడిగా కూడా ఆయన నటించారు. తెలుగులో నాగ భైరవి, నంబర్ వన్ కోడలు, తమిళంలో జ్యోతి సీరియల్స్ లో ఆయన నటించి మెప్పించారు.

siva shankar master needs hepls.2jpg
siva shankar master needs hepls.2jpg

ఆయ‌న పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. 75 శాతం పైగా ఊపిరితిత్తులు పాడయ్యాయని, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. మాస్టర్ మాత్రమే కాక ఆయన కుటుంబంలో ఆయన భార్యకి, పెద్ద కొడుక్కి కూడా కరోనా సోకింది. పెద్ద కొడుకుకి కూడా హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. ఆయన భార్య మాత్రం హోం క్వారంటైన్ లో ఉన్నారు.

శివశంకర్ మాస్టర్ చిన్న కొడుకు అజయ్ అందరి బాగోగులు చూసుకుంటున్నాడు, శివశంకర్ మాస్టర్ కు చికిత్స అందించడం కష్టమౌతోందని, రోజుకు లక్ష రూపాయల దాకా వైద్య ఖర్చుల అవుతోందని సమాచారం. తాజాగా శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై మంచు విష్ణు ఆరా తీశారు. ఏఐజీ ఆస్పత్రి వైద్యులతో మంచు విష్ణు మాట్లాడారు.

శివశంకర్ మాస్టర్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులని కోరారు. శివశంకర్ మాస్టర్ కుమారుడు అజయ్ తో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు. అంతేకాక శివశంకర్ మాస్టర్ కుటుంబానికి అండగా ఉంటామని మంచు విష్ణు హామీ ఇచ్చారు. ఆయన త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్థించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.