Shilpa Shetty: నేను చాలా బిజీ.. నా భ‌ర్త గురించి ఏం తెలియ‌ద‌న్న‌ట్టు చెప్పిన శిల్పా శెట్టి

Shilpa Shetty: పోర్నోగ్ర‌ఫీ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా గ‌త కొద్ది రోజులుగా జైల్లోనే ఉన్నారు. అయితే బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టి ని కూడా సాక్షిగా చార్జ్‌షీట్‌లో చేర్చారు ముంబై పోలీసులు. దీనిపై ఆమె స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. అయితే తాను త‌న వ‌ర్క్‌లో చాలా బిజీగా ఉండేదాన్న‌ని, రాజ్‌కుంద్రా ఏం చేస్తుండేవాడో తాను ఎప్పుడూ ప‌ట్టించుకోలేద‌ని శిల్పా పోలీసుల‌కు చెప్ప‌డం విశేషం.

Shilpa Shetty Says she dont know about his husband
Shilpa Shetty Says she dont know about his husband

ముంబై పోలీసులు 1400పేజీల ఛార్జ్ షీట్ లో ఈ విధంగా పేర్కొన్నారు. పోర్న్ రాకెట్ తో లింక్ అయి ఉన్న హాట్‌షాట్స్, బాలీఫేమ్ కాంట్రవర్షియల్ యాప్‌ల గురించి కూడా తనకేం తెలీదని చెప్పుకొచ్చిందని చార్జ్ షీట్‌లో పోలీసులు వెల్ల‌డించారు. ఈ పోర్న్ కేసు బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత‌ హాట్‌షాట్స్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్‌, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి తొల‌గించిన త‌ర్వాత‌.. బాలీఫేమ్ యాప్ కొత్త‌గా క‌నిపించింది.

ఈ పోర్న్ రాకెట్‌ను న‌డిపించ‌డానికి రాజ్‌కుంద్రా.. వియాన్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ ప‌రిస‌రాల‌ను ఉప‌యోగించుకున్న‌ట్లు చార్జ్‌షీట్‌లో చెప్పారు. ఈ పోర్న్‌రాకెట్ కేసులో జులై 19న పోలీసులు రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేశారు. అయితే అది పోర్న్ కాదంటూ కోర్టులో రాజ్‌కుంద్రా వాదిస్తున్నాడు. నలుగురు ఉద్యోగులు ఈ ఆరోపణలకు సాక్ష్యులుగా మారారు. కోర్టులో ఈ కంటెంట్ అంతా ప్రేరణ కలిగించేదే కానీ, ప్రోర్నగ్రఫిక్ కాదని రాజ్ కుంద్రా వాదించాడు. నెట్ ఫ్లిక్స్ లోనూ ఇలాంటి కంటెంట్ ఉందని చెబుతున్నారు.

లండన్‌లో బిగ్ బ్రదర్ కోసం షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక కామన్ ఫ్రెండ్ అయిన ఫరత్ హుస్సేన్ ద్వారా రాజ్ కుంద్రాను కలిశానని వెల్లడించింది శిల్పాశెట్టి . 2009 సంవత్సరంలో, వారి పరిచయం వివాహంగా మారింది. అప్పటి నుంచి ఇద్దరూ భారతదేశంలో నివసిస్తూ అనేక వ్యాపారాలు చేస్తున్నారు.

దేవీ దర్శనం కోసం శిల్పా శెట్టి మాత వైష్ణో దేవిని దర్శించుకోవడానికి బుధవారం జమ్మూ కాశ్మీర్‌లోని రేసి జిల్లాలో ఉన్న పవిత్ర గుహకు చేరుకున్నారు. అశ్లీల కేసులో శిల్పా భర్త రాజ్ కుంద్రాపై ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన రోజునే శిల్పా శెట్టి మాత వైష్ణో దేవిని సందర్శించడానికి రావడం గమనార్హం.