Shikhar Dhawan: శిఖ‌ర్ ధావ‌న్‌ని పూనిన పుష్ప .. హిందీ డైలాగ్‌తో అద‌ర‌గొట్టిన క్రికెట‌ర్

Shikhar Dhawan: పుష్ప‌.. పుష్ప‌రాజ్ .. త‌గ్గేదేలే అంటున్నాడు. డిసెంబ‌ర్ 17న విడుద‌లైన ఈ చిత్రం ఇటు సౌత్ అటు నార్త్‌లో ర‌చ్చ చేస్తుంది. ఈ మూవీ క్రియేట్ చేసిన సెన్సేష‌న్స్ అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ ఈ సినిమా వసూలు చేసిందని నిర్మాతలు ప్రకటించారు కూడా. పుష్ప సినిమాకు కలెక్షన్స్‌తో పాటు ప్రశంసలు కూడా అలాగే వస్తున్నాయి. చూసిన ప్రతీ ఒక్కరు సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Shikhar Dhawan Imitates Pushpa Movie Dialogue
Shikhar Dhawan Imitates Pushpa Movie Dialogue

టీమిండియా ఆటగాళ్లు కూడా ప్రత్యేకంగా ఈ సినిమాను చూసి బ్లాక్ బ‌స్ట‌ర్ అంటున్నారు. వెండితెరపై కలెక్షన్ల సునామీ సృష్టించిన పుష్ప.. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతుంది. నిర్ణీత సమయం కన్నా ముందే అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవ‌ల‌ ఈ మూవీని చూసిన టీమిండియా మాజీ స్పిన్నర్, హైదరాబాద్ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా ఫిదా అయ్యాడు.

అల్లు అర్జున్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని ట్వీట్ చేశాడు. పుష్ప పుష్ఫ రాజ్.. నీ అవ్వ తగ్గేదేలే అనే డైలాగ్ అయితే కేక అంటూ… అల్లు అర్జున్‌ను అభినందించాడు. హ‌నుమ విహారి కూడా ఈ మూవీపై ప్ర‌శంస‌లు కురిపించాడు. ఇక జ‌డేజా, వార్న‌ర్ వంటి ఆట‌గాళ్లు పుష్ప డైలాగ్ కి ఫిదా అవుతూ ప‌లు వీడియోలు చేశారు.

ఇక శిఖ‌ర్ ధావ‌న్ తాజాగా పుష్ప సినిమాలోని హిందీ డైలాగ్‌కి త‌న‌దైన శైలిలో వీడియో చేశాడు. ఈ వీడియో ప్రేక్ష‌కుల‌తో పాటు నెటిజ‌న్స్ ని ఎంతగానో అల‌రిస్తుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది.

థియేటర్స్‌లో విడుదలైన 22 రోజులకే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ‘పుష్ప’ స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగుతో పాటు.. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్‌ ప్రైమ్‌‌లో అందుబాటులో ఉంది. ట్రేడ్‌ వర్గాల అంచనా ప్రకారం.. తెలుగు సినిమా హిస్టరీలోనే పుష్ప అత్యధిక ఓటీటీ రైట్స్‌కి అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. సుమారు రూ.27-30 కోట్లకు ఈ సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌ కొనుగోలు చేసినట్టు సమాచారం.