Shibani Dandekar: పెళ్లైన వారం రోజుల‌కే ఆ సింగ‌ర్ గ‌ర్భ‌వ‌తి అయిందా.. అయోమ‌యంలో నెటిజ‌న్స్!

NQ Staff - March 1, 2022 / 01:14 PM IST

Shibani Dandekar: పెళ్లైన వారం రోజుల‌కే ఆ సింగ‌ర్ గ‌ర్భ‌వ‌తి అయిందా.. అయోమ‌యంలో నెటిజ‌న్స్!

Shibani Dandekar: బాలీవుడ్‌లో క‌త్రినా- విక్కీ కౌశ‌ల్ పెళ్లి త‌ర్వాత మ‌రో పెళ్లి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. బాలీవుడ్ విలక్షణ నటుడు ఫర్హాన్​ అక్తర్, శిబాని దండేకర్ ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉండి ఇటీవలే వివాహంతో ఒక్కటేనా విషయం తెలిసిందే. 2016లో తన భార్య అధునా బ‌బానీకి విడాకులు ఇచ్చిన ఫర్హాన్‌ అప్పటి నుంచి సింగ‌ర్‌ శిబానీ దండేక‌ర్‌తో సీక్రెట్‌గా డేటింగ్‌ చేస్తున్నాడు.

Shibani Dandekar’s latest photoshoot leaves fans wondering if the actress is pregnant

Shibani Dandekar’s latest photoshoot leaves fans wondering if the actress is pregnant


ఈ క్రమంలో త్వరలోనే వీరిద్దరూ మూడు మూళ్ల బంధంతో ఒక్కటవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం జ‌రిగింది. ఎట్ట‌కేల‌కు ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు. ఫర్హాన్‌ రెండో పెళ్లిపై ఆయన తండ్రి, ప్రముఖ సినీ రచయిత జావేద్‌ అక్తర్ మాట్లాడుతూ.. శిబాని చాలా మంచి అమ్మాయి. మా కుటుంబ సభ్యులకు కూడా తను బాగా నచ్చింది. వారిద్దరికి ఎంతో కాలంగా పరిచయం ఉంది, వారిద్దరి రిలేషన్‌ చాలా బాగుంటుందని చెప్పుకొచ్చాడు.

కాగా ఫర్హాన్‌, శిబానిలకు 2018లో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో అప్పటి నుంచి వారిద్దరూ రిలేషన్‌లో ఉ‍న్నారు. ఇదిలా ఉండగా ఫర్హాన్ అక్తర్ 2000 సంవ‌త్స‌రంలో అధునా బ‌బానీని పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు జ‌న్మించారు. ప‌ద‌హారేళ్లు క‌లిసి మెలిసి ఉన్న ఈ దంప‌తుల మ‌ధ్య విభేదాలు రావ‌డంతో 2016లో విడాకులు తీసుకున్నారు.

ఇదిలా ఉంటే కొత్త జంట కొన్ని ఫోటోలను తమ ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. వైట్​ అండ్​ వైట్ జాకెట్​లో ఫర్హాన్ స్టైలిష్ లుక్ లో ఉండగా భర్తను ఆనుకొని శిబాని తళుకులీనే డిజైనర్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. అయితే ఈ ఫొటోలో శిబాని పొట్ట కొద్దిగా ముందుకు వచ్చినట్లు కనిపించింది. అది గమనించిన నెటిజన్స్.. ఏంటి అప్పుడే గర్భవతివి అయ్యావా..? అడుగుతున్నారు. మరికొందరు పెళ్లికి ముందే అమ్మడు ప్రగ్నెంట్ ఏమో .. అందుకే త్వరగా పెళ్లి చేసుకున్నారు అని కామెంట్స్ పెడుతున్నారు.

Read Today's Latest గుసగుసలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us