Sherlyn Chopra: బ‌ల‌వంతంగా ముద్దు పెట్టాడు.. శిల్పాశెట్టితో బంధం సంక్లిష్టంగా లేదు..షెర్లిన్ కామెంట్స్

Sherlyn Chopra: పోర్న్ రాకెట్ కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త, శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా చీక‌టి కోణాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. ముంబై పోలీసులు ఈ కేసులో లోతుగా విచార‌ణ చేస్తుండ‌గా, సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కి వ‌స్తున్నాయి. వందల కోట్ల బిజినెస్ గుట్టు రట్టవ్వడంతో ఇప్పుడు ఆయన వల్ల వేధింపులకు గురైన నటీమణులంతా ఒక్కొక్కరుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కొందరు పోలీస్ కేసులు పెడుతున్నారు.

పోర్న్ రాకెట్ కేసులో జూలై 27న విచారణకు హాజరైన షెర్లిన్‌ చోప్రాను ముంబై పోలీసులు లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆమె సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట పెట్టింది. రాజ్‌కుంద్రా వ‌ల‌న తాను లైంగిక స‌మ‌స్య‌లు ఎదుర్కొన్న‌ట్టు పేర్కొంది. రాజ్ కుంద్రాపై ఏప్రిల్ నెలలోనే పోలీసులకు ఫిర్యాదు చేసిన షెర్లిన్.. ఇప్పుడు చాలా విషయాలను పోలీసుల ముందు లేవనెత్తింది.

బిజినెస్ డీల్ మాట్లాడే విషయమై తన ఇంటికే వచ్చిన రాజ్ కుంద్రా ఓ సారి బ‌ల‌త్కారం చేయ‌బోయాడు. ముద్దు పెట్టుకున్నాడు. శిల్పాశెట్టితో త‌న బంధం సంక్లిష్టంగా మారింద‌ని చెప్పుకొచ్చాడు అని షెర్లిన్ పేర్కొంది. పెళ్లైన వాడితో సంబంధం నేను కొన‌సాగించ‌లేన‌ని నేను చెప్పాన‌ని, బిజినెస్ కోసం అలా చేయ‌డం కూడా త‌ప్ప‌ని కుంద్రాకు చెప్పాను. ఆయ‌న న‌న్ను బ‌లవంతం చేస్తుండ‌డంతో భ‌య‌ప‌డి బాత్‌రూంలోకి వెళ్లాను అని షెర్లిన్ పేర్కొంది.

2019 మార్చి 27న బిజినెస్ మీటింగ్ తరువాత రాజ్ కుంద్రా ఓ రోజు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇంటికి వచ్చారు. ఓ సంక్షిప్త సందేశానికి సంబంధించిన వాదనలో అతడు ఇంటికి వచ్చి తప్పుడుగా ప్రవర్తించాడని తెలిపింది. శిల్పా శెట్టితో ఆయ‌న‌కు బంధం స‌రిగా లేద‌ని చెప్పాడ‌ని షెర్లిన్ పేర్కొంది. పోర్న్ కంటెంట్ తనతో అప్ లోడ్ చేయించాలని ఆయన ప్రయత్నించడంతో తమ మధ్య వాదనలు వచ్చాయని షెర్లిన్ చోప్రా పేర్కొన్నట్టు స‌మాచారం.