Ginna : జిన్నా చూద్దామని వెళ్తే ‘ఓరి దేవుడా’ చూడమన్నారట!
NQ Staff - October 24, 2022 / 09:20 AM IST

Ginna : మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమా ఇటీవల దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినిమాకు దారుణమైన కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి. మంచు విష్ణు గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా మరీ దారుణంగా వసూళ్లు సాధిస్తుంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు చెబుతున్నారు.
మొదటి రోజు కనీసం 10 లక్షల రూపాయల షేర్ కలెక్షన్స్ ని కూడా నమోదు చేయలేక పోయినట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు అధికారికంగా లెక్కలతో పాటు చెబుతున్నారు. మంచు విష్ణు అభిమానులు మాత్రం కొందరు ఆ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.
సినిమాకు మంచి స్పందన వచ్చిందని భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయని చెబుతున్నారు. ఆ విషయం పక్కన పెడితే తాజాగా ఒక యువతి విజయవాడ పివిపి లో జిన్నా సినిమాను మొదటి రోజు చూసేందుకు టికెట్ బుక్ చేస్తుందట.
ఆమె టికెట్ బుక్ చేసుకొని లోనికి వెళ్ళగా కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారట. షో కి సంబంధించిన యాడ్స్ వేశారు.. షో వేయడం కోసం అంతా సిద్దం చేశారు. కానీ ఎంత సమయం చూసినా కూడా ఇద్దరే ప్రేక్షకులు ఉన్నారట. దాంతో షో క్యాన్సల్ చేసి పక్క స్క్రీన్ లో ప్రదర్శింపబడుతున్న ఓరి దేవుడా సినిమా చూడాల్సిందిగా థియేటర్ యాజమాన్యం ఆమెను కోరారట, లేదంటే టికెట్ డబ్బులు వెనక్కు ఇచ్చేస్తామని అన్నారట.
షో క్యాన్సల్ చేయడంతో ఆమె నిరాశగా బయటకు వచ్చిందని వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. విజయవాడకు చెందిన ఆ మంచు అభిమాని జిన్నా సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో క్యాన్సల్ అవ్వడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లుగా వీడియోలో మాట్లాడుతుంది. కేవలం విజయవాడ పివిపి లో మాత్రమే కాకుండా ఎన్నో చోట్ల షో లు క్యాన్సిల్ అయ్యాయి అని సమాచారం అందుతుంది.