Sreekaaram : శ్రీకారం సినిమాతో శర్వానంద్ చాలా డల్ అయాడట..?

Sreekaaram : శ్రీకారం..రీసెంట్ గా వచ్చిన సినిమా. యంగ్ హీరో శర్వానంద్ గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ ఈ సినిమాలో జంటగా నటించారు. శతమానం భవతి సినిమా సూపర్ హిట్ తర్వాత మళ్ళీ ఇంతవరకు శర్వానంద్ కి భారీ హిట్ దక్కలేదు. ఈ సినిమా తర్వాత పడి పడి లేచే మనసు, రణ రంగం, జాను లాంటి సినిమాలు చేశాడు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్స్ గా మిగిలాయి. దాంతో మళ్ళీ తనకి ఫ్యామిలీ కథ అయితేనే హిట్ పడుతుందని భావించాడు. ఈ క్రమంలోనే శ్రీకారం అన్న సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు.

sharwanand-has-become-dull-by-sreekaaram
sharwanand-has-become-dull-by-sreekaaram

ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు కూడా ఏర్పడ్డాయి. సినిమా రిలీజ్ కి ముందు పోస్టర్స్.. లిరికల్ వీడియో సాంగ్స్ తో బాగా హైప్ వచ్చేసింది. దాంతో మళ్ళీ శర్వానంద్ శతమానం భవతి లాంటి హిట్ అందుకోబోతున్నాన్న నమ్మకంతో ఉన్నాడు. కానీ మహ శివరాత్రి పండుగ సందర్భంగా వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అనుకున్నంతగా లాభాలు తెచ్చి పెట్టలేకపోయిందని అంటున్నారు. జాతి రత్నాలు, గాలి సంపత్ సినిమాలు కూడా అదే రోజున రిలీజయ్యాయి.

Sreekaaram : మహా సముద్రం సినిమా మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడట.

అయితే ఒక్క జాతి రత్నాలు సినిమా భారీ వసూళ్ళు రాబట్టింది. ఈ సినిమా దెబ్బకి శ్రీకారం బాగా వెనకపడింది. ఈ కారణంగా శ్రీకారం మీద శర్వానంద్ పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయని చెప్పుకుంటున్నారు. లాభాలు వస్తాయనుకుంటే కాస్తో కూస్తో నష్టాలే వచ్చాయని టాక్ వినిపిస్తోంది. దాంతో శర్వానంద్ బాగా డల్ అయ్యాడట. ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో చేస్తున్న మహా సముద్రం సినిమా మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Advertisement