Sharwanand : నేను అలా అంటే పిచ్చనా కొడుకు అంటారు : శర్వా
NQ Staff - September 18, 2022 / 10:28 AM IST

Sharwanand : దాదాపు 5 సంవత్సరాల తర్వాత యంగ్ హీరో శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాతో సక్సెస్ ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్ తో శర్వానంద్ వరుసగా సినిమాలు చేయాలని భావిస్తున్నాడు.అయితే రెగ్యులర్ కమర్షియల్ కాన్సెప్ట్ లు కాకుండా ఒకే ఒక జీవితం వంటి విభిన్నమైన నేపథ్యం కథలతో సినిమాలు చేయాలని శర్వానంద్ భావిస్తున్నాడట, అందుకు సంబంధించి కథలు చూసుకుంటున్నాడు.

Sharwanand about his Success and Failure movies
ఈ సమయంలోనే ఒకే ఒక జీవితం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో శర్వానంద్ మాట్లాడుతూ తాను చేసే ప్రతి సినిమా.. చేసిన ప్రతి సినిమా కూడా నమ్మకంతో విశ్వాసంతో చేశానని, తాను ప్రతి సినిమాకి కూడా కష్టపడి చేస్తాను అన్నాడు.
అలాగే ప్రతి సినిమా సక్సెస్ అయినట్లుగానే తనకు అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు, ఒకవేళ ప్రేక్షకులు తిరస్కరించిన సినిమాలను కూడా నేను నా సక్సెస్ సినిమాలు గా చెప్పుకుంటే ప్రేక్షకులు నన్ను పిచ్చినా కొడుకు అంటూ అవహేళన చేస్తారంటూ శర్వానంద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కనుక ప్రేక్షకుల అభిప్రాయాన్ని తాను గౌరవిస్తానని.. ఫ్లాప్ అయిన సినిమాలను తాను దృష్టిలో పెట్టుకొని తదుపరి సినిమా యొక్క కథను ఎంపిక చేసుకుంటాను అంటూ శర్వానంద్ చెప్పుకొచ్చాడు.
ఇలా అది కొద్ది మంది హీరోలు మాత్రమే ఆలోచిస్తారు, ఒక సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే ప్రేక్షకులు ఎందుకు దాన్ని తిరస్కరించారనే విషయం మొదట తెలుసుకోవాలి.. ఆ తర్వాత అలాంటి తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. అదే మంచి హీరోల యొక్క లక్షణం.. కనుక శర్వానంద్ అదే పాటించడం మంచి విషయమే.