Gaury Khan : ఒకే టైమ్‌లో ఇద్దరితో వద్దు: కూతురికి షారుక్ సతీమణి గౌరీ ‘డేటింగ్’ సలహా.!
NQ Staff - September 19, 2022 / 11:29 PM IST

Gaury Khan : ఏ తల్లి అయినా, తన కూతురికి డేటింగ్ విషయంలో సలహా ఇస్తుందా.? డేటింగ్ చేయమని ప్రోత్సహిస్తుందా.? పైగా, ఒకే సమయంలో ఇద్దరితే వద్దు, ఒక్కరు ముద్దు.. అని చెబుతుందా.? కానీ, చెప్పిందా మహాతల్లి. ఆమె బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ సతీమణి, ఎంటర్‌ప్రెన్యూర్ గౌరీ ఖాన్. కాఫీ విత్ కరణ్.. బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ నిర్వహించే టాక్ షో ఇది.

Sharukh Wife Gaury Khan Dating Suggestion to Daughter
ఇందులో కరణ్ జోహార్ అడిగే ప్రశ్నలన్నీ ఇలాగే వుంటాయి. ఇంకా ఛండాలంగా కూడా వుంటాయ్. ఎంతమందితో ‘శృంగారంలో పాల్గొన్నావ్’ దగ్గర్నుంచి, ఇంకాస్త బరితెగించేసిన రీతిలో ప్రశ్నలు సంధిస్తుంటాడు కరణ్ జోహార్.
ఇంకా నయ్యం.. ఆ ప్రశ్న అడగలేదు.. డేటింగ్ గురించి మాత్రమే.. ఇద్దరా.? ఒక్కరా.? అని ప్రశ్నించాడు కరణ్ సోహార్.
‘మీ కుమార్తె ఇద్దరితో శృంగారంలో పాల్గొనాలని సలహా ఇస్తారా.? ఒక్కరితోనే సరిపెట్టుకోవాలని సూచిస్తారా.?’ అని గౌరీ ఖాన్‌ని కరణ్ జోహార్ ప్రశ్నించి వుంటే.? ఇలా ట్రోలింగ్ జరుగుతోంది సోషల్ మీడియాలో కరణ్ మీద.
షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ విషయమై గౌరీ ఖాన్ జస్ట్ సరదాగా ‘డేటింగ్’ సలహా.. అది కూడా కరణ్ ప్రశ్న నేపథ్యంలో ఇచ్చేసిందిగానీ, ఏ తల్లి కూడా అలాంటి వ్యాఖ్యలు తన కుమార్తె మీద చెయ్యదుగాక చెయ్యదు. పిచ్చి పీక్స్‌కి వెళ్ళడమంటే ఇదే.! మొన్నామధ్య విజయ్ దేవరకొండ కూడా కరణ్ జోహార్ టాక్ షోకి వెళ్ళాడు. అక్కడ ఎదురయిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో చాలా ఇబ్బంది పడ్డాడు రౌడీ హీరో.