Pathan : కాషాయం బికినీతోనే వచ్చిన పఠాన్.. మోడీ మాటతో అంతా సైలెన్స్
NQ Staff - January 25, 2023 / 10:32 PM IST

Pathan : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ చాలా సంవత్సరాల తర్వాత బాక్సాఫీస్ వద్దకు పఠాన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమా నుండి బేషరమ్ పాట విడుదల అయినప్పటి నుండి కూడా వివాదం పెద్ద ఎత్తున జరుగుతూనే ఉంది.
ఆ పాటలో దీపికా పదుకునే కాషాయం రంగు లో ఉన్న బికినీ ధరించి ఉండగా.. షారుఖ్ ఖాన్ ఆకు పచ్చ రంగు డ్రెస్ ను ధరించి ఉన్నాడు. దాంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ కొందరు ఆందోళన మొదలు పెట్టారు. చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం లైట్ తీసుకున్నారు.
సినిమా విడుదల సమయంలో తమ సత్తా చాటుతాం అన్నట్లుగా బీజేపీ వారు మరియు హిందూ సంఘాల వారు పఠాన్ మేకర్స్ కు వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా పఠాన్ మేకర్స్ కాస్త కోత విధించి కాషాయ బికినీ ని వెండి తెరపై చూపించడం జరిగింది.
కొన్ని రోజుల క్రితం బీజేపీ నాయకులకు సినిమాల విషయంలో వివాదాలు చేయవద్దు అంటూ హితవు పలికారు. అందుకే బికినీ విషయంలో బీజేపీ వారు పూర్తిగా వదిలేశారు. ఆ తర్వాత హిందూ సంఘాల వారు కూడా పెద్దగా పఠాన్ రిలీజ్ డే రోజున హడావుడి చేయలేదు. దాంతో పఠాన్ కు పెద్ద ఊరట లభించినట్లు అయ్యింది.