Shanmukh: అందరి ముందే దీప్తికి ముద్దు పెట్టి.. చ‌నిపోయేట‌ప్పుడు కూడా ప‌క్క‌నే ఉంటుంద‌న్న ష‌ణ్ముఖ్‌

Shanmukh: యూట్యూబ్‌లో క్రేజీ జంట ఎవ‌రంటే ఠ‌క్కున గుర్తొచ్చేది ష‌ణ్ముఖ్ జ‌స్వంత్, దీప్తి సున‌య జంట‌. వీరిద్ద‌రు 5 ఏళ్లుగా ప్రేమ‌లో మునిగి తేలుతున్నారు. గత కొద్ది రోజులుగా వీరిద్దరు విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్చల్ చేశాయి. తాజాగా ఈ వార్తలు నిజమేనంటూ తెల్చేసింది దీప్తి.. తామిద్దరం విడిపోతున్నామంటూ తన ఇన్‏స్టా ఖాతాలో షేర్ చేసింది దీప్తి.

Bigg Boss Telugu 5: Shanmukh's girlfriend stands by him despite negativity  | Tv News – India TV

 

వీరి బ్రేకప్‌ వార్తను అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ జంట విడిపోయి వారానికి పైనే అవుతున్నా ఫ్యాన్స్‌ మాత్రం మళ్లీ కలుస్తే బాగుండు అంటూ సోషల్‌ మీడియాలో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో విడుద‌లైన మేకింగ్ వీడియో అభిమానుల ఆనంద‌న్ని రెట్టింపు చేసింది. ఇందులో ఇద్దరు చాలా క్లోజ్‌గా ఎంతో జోవియ‌ల్‌గా క‌నిపించారు.

ఇలాంటి సమయంలో షణ్నూ, దీప్తి జంటగా నటించిన హిట్‌ సాంగ్‌ ‘మలుపు’ మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. ఇందులో షణ్నూ, దీప్తి షూటింగ్‌ను ఎంతలా ఎంజాయ్‌ చేశారో, పాట కోసం ఎలా కష్టపడ్డారో చూపించారు. షణ్ను ఆస్పత్రి బెడ్‌పై పడుకుంటే కొంచెం జరగమంటూ దీప్తి వచ్చి అతడి ఎదపై పడుకుంది. దీంతో షణ్నూ ‘నేను చనిపోయేటప్పుడు కూడా దీప్తి ప్లేస్‌ ఇవ్వమని గొడవపడుతుంది, ఎందుకు జరగవని వాదిస్తుంది’ అని చెప్పడంతో దీప్తి నవ్వుతూ అతడి ఎదపై వాలిపోయింది.

ఇక ష‌ణ్ముఖ్.. దీప్తికి ప్రేమగా ముద్దు పెట్టగా, ఇంత అన్యోన్య‌యంగా వీరిద్ద‌రిని చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. వీడియో చూస్తుంటే కళ్లు చెమర్చుతున్నాయి, మీరిద్దరూ కలిసి నటించిన చివరి సాంగ్‌ ఇదే అవుతుందనుకోలేదు, ఎంతో ఆప్యాయంగా ఉండే మీరు మళ్లీ కలవాలి అని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు.

shanmukh stunning behaviour with deepthi1jpg
shanmukh stunning behaviour with deepthi1jpg

ష‌ణ్ముఖ్‌- దీప్తి విడిపోవ‌డానికి కార‌ణం సిరి అంటున్నారు. సిరితో ష‌ణ్ముక్ చాలా క్లోజ్‌గా ఉండ‌డం ఒక‌టే హ‌గ్గులు, ముద్దుల‌తో నానా ర‌చ్చ చేయ‌డం వ‌ల‌న దీప్తి అత‌నికి గుడ్ బై చెప్ప‌నుంద‌ని అంటున్నారు. ఇందులో పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.