Shanmukh Jaswanth : ష‌ణ్ముఖ్ కాలికి గాయం.. ఏం జ‌రిగింది?

Shanmukh Jaswanth : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ యూట్యూబ‌ర్‌గా చాలా ఫేమ‌స్. ఆయ‌న చేసిన వీడియోల‌కి ఫుల్ రెస్పాన్స్ వ‌స్తుంటుంది. ఇక బిగ్ బాస్ షోతో భారీ ఆద‌ర‌ణ తెచ్చుకున్న‌ష‌ణ్ముఖ్ కాస్త నెగెటివిటీ కూడా మూట‌గ‌ట్టుకున్నాడు. ముఖ్యంగా సిరితో ఆయ‌న చేసిన ర‌చ్చ‌కు తెగ ట్రోల్ చేశారు. ఏకంగా దీప్తి అయితే బ్రేక‌ప్ కూడా చెప్పింది. ప్ర‌స్తుతం ష‌ణ్ముఖ్ చాలా డిప్రెష‌న్‌లో ఉన్న‌ట్టుగా క‌నిపిస్తున్నాడు.

Shanmukh Jaswanth leg injury in biggboss
Shanmukh Jaswanth leg injury in biggboss

బిగ్ బాస్ ఇంట్లో సిరితో షణ్ముక్ క్లోజ్ గా మెలగడం, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కనీసం తనను కలిసేందుకు ప్రయత్నించకపోవడంతో తీవ్ర మానసిక సంఘర్ణకు లోనైన దీప్తి.. సోషల్ మీడియా వేదికగా బ్రేకప్ గురించి చెప్పేసింది. అయితే ఇరువురి ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్లీ వీరు కలుస్తే బాగుండు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న ష‌ణ్ముఖ్ తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో ఓ ఫోటోను షేర్ చేశాడు. అందులో తన పాదాన్ని చూపించాడు. అంతా గాయమై ఉంది. స్వీట్ అండ్ రాడ్ మెమోరీ అని ఫన్నీగా కామెంట్ చేశాడు. అయితే అది ఇప్పుడు తగిలిన గాయమా? లేదా బిగ్ బాస్ ఇంట్లో ఐస్ టాస్క్‌కు సంబంధించిన గుర్తులా? అన్నది తెలియడం లేదు.

ఇక షన్ను తన యాక్టింగ్ మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తానంటూ షన్ను ప్రకటించాడు. అయితే ఈ మధ్యలో దీప్తి సునయన బర్త్ డే కూడా వచ్చింది. అర్దరాత్రి అందరి కంటే ముందుగా షన్ను విషెస్ చెప్పాడు. తన ఇన్ స్టా స్టోరీలో షన్ను బర్త్ డే విషెస్ తెలిపాడు. కానీ దీప్తి సునయన మాత్రం అస్సలు పట్టించుకోలేదు.