Shanmukh Jaswanth: ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ బిగ్ బాస్ విన్న‌ర్ కాలేడా..!

Shanmukh Jaswanth: బుల్లితెర రియాలిటీ షో బిగ్​బాగ్ ఐదో సీజన్ సెప్టెంబ‌ర్ 5 నుండి మొద‌లు కానున్న విష‌యం తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పటికే స్టార్ మా అధికారికంగా ప్రకటిస్తూ..ప్రోమో కూడా విడుద‌ల చేసింది. ఈ నేపథ్యంలో..హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్ల్ లిస్ట్ అంటూ యాంకర్లు వర్షిణి, రవి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్‌ జశ్వంత్, హీరోయిన్‌ ఈషా చావ్లా, జబర్దస్త్‌ ప్రియాంక, హనీ మాస్టర్‌, కార్తీక దీపం ఫేమ్‌ ఉమా దేవి, బుల్లితెర నటుడు సన్నీ, మోడల్‌ జస్వంత్‌, పూనం భాజ్వా, యాంకర్‌ శివ, లోబో, యాంకర్‌ ప్రత్యూష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.


Shanmukh Jaswanth can't be as a Biggboss Winner
Shanmukh Jaswanth can’t be as a Biggboss Winner


అయితే ‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ సూర్య’ వెబ్‌సిరీస్‌లతో యూత్‌లో మాంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముక్‌ జశ్వంత్ కోటి రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ అందుకోనున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. యూట్యూబ్‌లో పెద్ద పెద్ద హీరోల సినిమాలకు రానన్ని లైకులు, వ్యూస్ షణ్ముక్ వీడియోలకు వస్తాయి. అందుక‌ని మ‌నోడికి అంత రెమ్యున‌రేష‌న్ ఇస్తార‌నే టాక్ న‌డిచింది.


గ‌త సీజ‌న్స్‌లోనే ష‌ణ్ముఖ్‌ని సంప్ర‌దించ‌గా, ప‌లు కార‌ణాల వ‌ల‌న అత‌ను నో చెప్పిన‌ట్టు తెలుస్తుంది. సీజ‌న్‌5లో అత‌ను పాల్గొన‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో అత‌ను 70 నుంచి 80 రోజుల పాటు ఒప్పందం చేసుకున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత అతను బిగ్ బాస్ హౌజ్ వ‌దిలి వెళ‌తాడ‌ని స‌మాచారం.


బిగ్ బాస్ కార్య‌క్ర‌మం దాదాపు 108 రోజుల పాటు సాగ‌నుంది. ఒప్పందం ప్రకారం షణ్ముఖ్ తన క‌మిట్ మెంట్ పూర్తి చేసుకొని బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లిపోతే, అతను బిగ్ బాస్ తెలుగు విజేత కాలేడు. మ‌రి త‌ను చివ‌రి వ‌ర‌కు ఉంటాడా, మ‌ధ్య‌లోనే వెళ‌తాడా అన్న దానిపై కూడా క్లారిటీ రావ‌ల‌సి ఉంది.