Shanmukh : శుభ‌వార్త చెప్పిన ష‌ణ్ముఖ్ తండ్రి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

Shanmukh : గ‌త ఏడాది స‌మంత‌- నాగ చైత‌న్య బ్రేక‌ప్ చెప్పుకొని వార్త‌ల‌లో నిల‌వగా, ఈ ఏడాది ష‌ణ్ముఖ్‌- దీప్తి సున‌య‌న హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు. బిగ్ బాస్ ఇంట్లో సిరితో షణ్ముక్ క్లోజ్ గా మెలగడం, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కనీసం తనను కలిసేందుకు ప్రయత్నించకపోవడంతో తీవ్ర మానసిక సంఘర్ణకు లోనైన దీప్తి.. సోషల్ మీడియా వేదికగా బ్రేకప్ చెప్పేసింది.

Shanmukh Father comments
Shanmukh Father comments

దీనిపై ష‌ణ్ముఖ్ దూర‌మైన‌ప్ప‌టి నుండి ష‌ణ్ముఖ్ చాలా నిరూత్సాహంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. కుక్క‌ల‌తో ఆడుకుంటూ దేవ‌దాస్‌లా మారిన‌ట్టు క‌నిపిస్తున్నాడు. దీప్తి సునయన మొదటగా బ్రేకప్ పోస్ట్ చేసింది. ఇక కలిసి ముందుకు వెళ్లలేమని, తాను ఇప్పుడు కెరీర్ కోసం ఆలోచిస్తున్నానంటూ పోస్ట్ వేసింది. దీప్తి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని షన్ను కూడా సింపుల్‌గా బ్రేకప్ ఇష్యూకి పుల్ స్టాప్ పెట్టేశాడు.

అయితే దీప్తి అంటే షన్నుకి ఇంకా ప్రేమ పోలేదనిపిస్తోంది. దీప్తి సునయన బర్త్ డే సందర్భంగా అర్దరాత్రే షన్ను ఒక పోస్ట్ పెట్టాడు. హ్యాపీ బర్త్ డే D అని పాత ఫోటోను షేర్ చేశాడు షన్ను. కానీ దీప్తి సునయన మాత్రం షన్ను విషెస్‌ని అస్సలు లెక్కలోకి తీసుకోవడం లేదు. దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్ తర్వాత ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ల గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో షణ్ముఖ్ తండ్రి దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్లిద్దరూ కలిసే ఉంటారు. దీప్తి బ్రేకప్ చెప్పింది కానీ, షణ్ముఖ్ చెప్పలేదు కదా. వాళ్ల పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మాట్లాడకూడదు’ అని శుభవార్త చెప్పారు. ‘ఆ అమ్మాయి (దీప్తి)కి ఫీలింగ్ అనిపించిందేమో కానీ.. ఇప్పుడైతే ఇద్దరూ కలిసే ఉంటారు. ఇందులో ఎవరూ డౌట్ పడాల్సిన అవసరం లేదు. కానీ, కలిసేందుకు కొద్దిగా టైమ్ పడుతుంది అంతే’ అంటూ సంచలన నిజాన్ని బయట పెట్టారాయన. ఆయ‌న మాట‌ల‌ని బ‌ట్టి చూస్తే మ‌ళ్లీ క‌లుస్తార‌ని భావిస్తున్నారు. ఉంటార‌ని ఆశిస్తున్నారు.

సోషల్ మీడియా ద్వారా ప్రేమలో పడిన దీప్తీ సునయన.. షణ్ముఖ్ జస్వంత్ చాలా కాలంగా జంటగా సందడి చేస్తున్నారు. దీంతో వీళ్లిద్దరూ వ్యక్తిగతంగా కంటే జోడీగానే ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. దీంతో కష్ట సమయాల్లోనూ ఒకరికి ఒకరు అండగా నిలిచారు. దీప్తి, షన్నూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ స‌మ‌యంలో వారు బ్రేక‌ప్ చెప్పుకోవ‌డం అంద‌రిని భాదించింది.