Shankar: శంకర్ తన కూతురు పెళ్లికి పెట్టిన ఖ‌ర్చుతో సినిమా తీయోచ్చేమో!

Shankar: క‌రోనా స‌మ‌యంలో పెళ్లిళ్ల హడావిడి చాలా త‌గ్గింది. పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఏదో సాదాసీదాగా పెళ్లిళ్లు చేస్తున్నారు. రానా, నిఖిల్, దిల్ రాజు,కాజ‌ల్‌,నిహారిక వంటి సెల‌బ్స్‌కి క‌రోనా స‌మ‌యంలో పెళ్లిళ్లు కాగా, వీరి పెళ్లికి చాలా త‌క్కువ ఖ‌ర్చు పెట్టారు. ఇక రీసెంట్‌గా ద‌ర్శ‌క దిగ్గ‌జం శంక‌ర్ త‌న కూతురి వివాహాన్ని క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూనే ఘ‌నంగా జ‌రిపాడు.

త‌మిళ‌నాడు ప్రీమియ‌ర్ లీగ్‌లో స్టార్ క్రికెట‌ర్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ దామోద‌ర‌న్‌‌తో ఐశ్వ‌ర్య‌ పెళ్లి జ‌ర‌గ‌గా, ఈ వివాహ వేడుక‌కు త‌మిళ‌నాడు సీఎంతో పాటు ప‌లువురు మంత్రులు, సెల‌బ్స్‌, పారిశ్రామిక వేత్త‌లు హాజ‌ర‌య్యారు. రోహిత్‌ తండ్రి దామోదరన్‌ తమిళనాడులో ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త అని, మధురై పాంథర్స్ టీమ్‌కి స్పాన్సర్‌గా కూడా కావ‌డంతో పెళ్లి ఏర్పాట్ల‌ని ఎక్క‌డా త‌గ్గ‌కుండా చేశారు.

శంక‌ర్ త‌న సినిమాల‌నే ఓ భారీ బ‌డ్జెట్ తో చిత్రీక‌రిస్తుంటాడు. ఉదాహ‌ర‌ణ‌కు జెంటిల్ మెన్ కోసమే అప్పట్లో కోటికి పైగా ఖర్చు చేశారు. అప్పట్లో ఏ దర్శకుడు కూడా మొదటి సినిమా కోసం ఆ లెవెల్లో ఖర్చు చేసింది లేదు. శంకర్ పాటల కోసం ఈజీగా 5కోట్లు దాటుతాయి. దేశ విదేశాలు తిరిగి మంచి లొకేషన్స్ చూస్తారు. ఇక సినిమాలకు ఆయన చేయించే ఖర్చు కూడా మామూలుగా ఉండదు.

తాజాగా శంక‌ర్ త‌న కూతురి పెళ్లిని ఒక ఖరీదైన రిసార్ట్ లోనే నిర్వహించారు. ఒక వారం ముందుగానే కుటుంబ సభ్యులకు కోవిడ్ టెస్టులు చేయించారు. శంకర్ త‌న‌ కూతురికి కోట్లాది రూపాయల విలువైన నగలు కూడా చేయించారట. అయితే శంక‌ర్ త‌న‌ కూతురు ఐశ్వర్య పెళ్లి కోసం దర్శకుడు శంకర్ ఏ మాత్రం తక్కువ కాకుండా దాదాపు రూ.10కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. అంటే దాదాపు ఆ బడ్జెట్ తో ఒక మంచి సినిమా తీసేయొచ్చు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక శంకర్ తన తదుపరి సినిమాను రామ్ చరణ్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
మ‌రో వైపు భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతూ వస్తున్న శంకర్.. ప్రస్తుతం ‘ఇండియన్‌ 2’ మూవీని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. దీంతో పాటు బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో అపరిచితుడు రీమేక్‌ మూవీ కూడా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.